Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తిరుమల: నేడు ఉదయం 11గంటలకు టిటిడి బోర్డ్ అత్యవసర సమావేశం. తిరుమల కొండపై పదిమంది టిటిడి ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఏమి చేయలనేదానిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన టిటిడి. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్న టిటిడి.
  • తమిళనాడు లో కరోనా మహమ్మారి కి లక్ష దాటిన బాధితుల సంఖ్య ,ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తం గా ఒక లక్ష 2 ,721 మంది కి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ, అందులో 58 వేల 378 మంది డిశ్చార్జ్
  • కృష్ణజిల్లా: మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్. మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్ కి తరలించిన కృష్ణజిల్లా పోలీసులు. తూ.గో జిల్లా తుని మండలం సితాపురంలో అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ రోజు తెల్లవారుజామున మచిలీపట్నం తరలింపు.
  • కృష్ణా జిల్లా : గూడూరు పిఎస్ లోనే కొల్లు రవీంద్రకు వైద్య పరీక్షలు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట కొల్లు రవీంద్రను ప్రవేశపెట్టనున్న పోలీసులు. కొల్లు రవీంద్రకు రిమాండ్ విధించే అవకాశం.
  • అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు. కనీసం ప్రాథమిక విచారణ చేయకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం. కావాలనే కక్షసాధింపుతోనే ఈ కేసులో రవీంద్రను ఇరికించారు. ఎమర్జెన్సీలో కూడా ఇన్ని అరాచకాలు జరగలేదు. ఇంతమందిని తప్పుడు కేసులలో ఇరికించలేదు. ప్రతిపక్షాలను ఇంతగా టార్గెట్ చేయలేదు. ఇంతమంది నాయకులను జైళ్లకు పంపలేదు. బీసిలంటేనే వైసిపి పగబట్టింది. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులే అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. ప్రతీకారేచ్ఛతో చేస్తున్న ఈ అరెస్ట్ లను ప్రతిఒక్కరూ ఖండించాలి.
  • 16వేల మార్క్ కు చేరువలో జిహెచ్ఎంసి కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1892. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 20462. జిహెచ్ఎంసి పరిధిలో - 1658. Ghmc లో 16219కు చేరుకున్న కేసులు. ఈరోజు కరోనా తో చనిపోయిన వారు - 8. టోటల్ డెత్స్ - 283. చికిత్స పొందుతున్న వారు- 9984. డిశ్చార్జి అయిన వారు -10195.
  • ఓ ప్రయివేట్ ల్యాబ్ రిపోర్ట్స్ పై ప్రభుత్వం సీరియస్. 3,726 శ్యాంపిల్స్ లో 2,672 మందికి పాజిటివ్ ఇచ్చిన ల్యాబ్. 71.7 శాతం పాజిటివ్ రిపోర్ట్ చేసిన ల్యాబ్. వెంటనే ల్యాబ్ ను పరిశీలించాలని ఎక్స్పర్ట్ కమిటీకి ఆదేశాలు. ఎక్కువ పాజిటివ్ కేసులు రిపోర్ట్ చేసిన ల్యాబ్ ను మూసివేస్తున్నట్లు ప్రకటన.

బ్రేకింగ్.. ఆ మూడు సామాజిక మాధ్యమాల మీదా ట్రంప్ ‘కత్తి’ !

ట్విటర్ తో మొదలైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కయ్యం పీక్ దశకు చేరుకుంది. ట్విటర్ తో బాటు గూగుల్, ఫేస్ బుక్ మీద కూడా ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ కు ఆయన రెడీ అవుతున్నాడు...
Trouble From President Trump, బ్రేకింగ్.. ఆ మూడు సామాజిక మాధ్యమాల మీదా ట్రంప్ ‘కత్తి’ !

ట్విటర్ తో మొదలైన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కయ్యం పీక్ దశకు చేరుకుంది. ట్విటర్ తో బాటు గూగుల్, ఫేస్ బుక్ మీద కూడా ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ కు ఆయన రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన సంతకం చేయడానికి సమాయత్తమయ్యాడు. ఈ మూడు సామాజిక మాధ్యమాలూ పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. బహుశా కోర్టులో వీటిపై ఆయన దావా కూడా వేసే సూచనలున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ చేసిన రెండు ట్వీట్లపై ‘ఫ్యాక్ట్ చెక్’ చేశామని ట్విటర్ పేర్కొన్న కొన్ని గంటలకే మీరిలా పక్షపాతంగా వ్యవహరిస్తే నా తడాఖా చూపుతానని, మూసివేయిస్తానని ట్రంప్ హుంకరించాడు. ఈ సోషల్ మీడియా మాధ్యమాలు పొలిటికల్ సెన్సార్ షిప్ అనుసరిస్తున్నాయా లేక పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నాయా అన్న అంశంపై అమెరికన్లు రిపోర్టు చేయడానికి అనువుగా ఓ మెకానిజాన్ని ట్రంప్ ఏర్పాటు చేయవచ్చునని కూడా తెలియవచ్చింది. వీటిపై దర్యాప్తునకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ను ఆయన ఆదేశించవచ్చు.

 

Related Tags