Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

టీ20లకు అతడే దేవుడు… తేల్చేసిన గూగుల్!

Rohit Sharma The New God Of T20 Cricket, టీ20లకు అతడే దేవుడు… తేల్చేసిన గూగుల్!

భారత్‌లో క్రికెట్ అనేది ఒక మతం… ఆ మతానికి ‘దేవుడు’ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అయితే ఫాస్ట్ ఫార్మాట్ రూపంలో టీ20లు వచ్చిన తర్వాత క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. అంతేకాకుండా టీమిండియాకు ఐపీఎల్ పుణ్యమా అని ఎంతోమంది ఆటగాళ్లు.. టీ20 స్పెషలిస్టులుగా మారారు. సచిన్ టెండూల్కర్ తర్వాత నెక్స్ట్ గాడ్ ఎవరు అంటే.. గుక్కతిప్పుకోకుండా టీమిండియా రథసారథి విరాట్ కోహ్లీ అని అందరూ అంటారు. అయితే లేటెస్ట్‌గా టీ20 ఫార్మాట్‌కు మాత్రం నయా గాడ్‌గా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అవతరించాడు.

రోహిత్ శర్మ… కెరీర్ గ్రాఫ్‌ను ఒకసారి చూస్తే.. ప్రతి టీ20 మ్యాచ్‌లోనూ ‌తనలోని అసాధారణ ప్రతిభను వెలికితీస్తూ.. ఈ ఫార్మాట్‌కు ప్రపంచంలోనే విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో ఒకరిగా ఆవిర్భవించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ టీ20ల్లో హయ్యస్ట్ రన్ గెట్టర్.. ఓపెనర్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.  గతంలో కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో ఓడిపోయినా.. రోహిత్ శర్మ మాత్రమే టీమిండియా తరపున ఎక్కువ స్కోర్ చేశాడు.

ఇదొక్కటే కాదు.. ఇలా మరెన్నో రికార్డులు హిట్ మ్యాన్ ఖాతాలో ఉన్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్‌ను అధిగమించి.. టీ20ల్లో హయ్యస్ట్ రన్స్ చేసిన వీరుడుగా అవతరించాడు. టీ20ల్లో భారత్‌కు రోహిత్ శర్మ చాలా కీలకమైన ఆటగాడు. అతడు క్రీజులో కుదురుకుంటే.. ప్రత్యర్థులు ఔట్ చేయడం చాలా కష్టం. అంతేకాకుండా మూడు వన్డే ద్విశతకాలు కూడా మనవాడి ఖాతాలో ఉన్న సంగతి తెలిసిందే. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి విధ్వంసకర టీ20 ప్లేయర్స్ లిస్ట్‌లో రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. అంతేకాకుండా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం రోహిత్ శర్మను టీ20 నయా గాడ్‌గా అభివర్ణించింది.

1.రోహిత్ శర్మ:

Matches: 99

Runs: 2452

Highest Score: 118

Average: 31.84

Strike Rate: 136

100/50: 4/17

Fours/Sixes: 431/194

2.విరాట్ కోహ్లీ:

Matches: 72

Runs: 2450

Highest Score: 90 Not out

Average: 50.85

Strike Rate: 135.84

100/50: 0/22

Fours/Sixes: 235/58

3.మార్టిన్ గప్తిల్:

Matches: 80

Runs: 2326

Highest Score: 105

Average: 33

Strike Rate: 132

100/50: 2/14

Fours/Sixes: 202/103

4.షోయాబ్ మాలిక్:

Matches: 111

Runs: 2263

Highest Score: 75

Average: 30

Strike Rate: 124

100/50: 0/7

Fours/Sixes: 286/61

5.బ్రెండన్ మెకల్లమ్:

Matches: 71

Runs: 2140

Highest Score: 123

Average: 35

Strike Rate: 136

100/50: 2/13

Fours/Sixes: 199/91