మా నాన్న ఏడాది జీతంతో విమాన టికెట్‌..

2020 గ్రాడ్యుయేట్లకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ కీల‌క సందేశం ఇచ్చారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి బదులు వీడియో కాన్ఫరెన్స్‌ వేదికగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో..

మా నాన్న ఏడాది జీతంతో విమాన టికెట్‌..
Follow us

|

Updated on: Jun 09, 2020 | 11:03 AM

2020 గ్రాడ్యుయేట్లకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ కీల‌క సందేశం ఇచ్చారు. నమ్మకం, సహనం, ఆత్మవిశ్వాసం ఉంటే… ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను అవ‌లీల‌గా ఎదుర్కొగ‌ల‌ర‌ని గ్రాడ్యుయేట్లకు ధైర్యం చెప్పారు. ఉద్యోగం, సంపాదన, జ్ఞానం ఇవన్నీ కష్టకాలంలో మీ ప్రణాళికలకు విరుద్ధంగా దెబ్బతినొచ్చు. ఇలాంటి సమయంలో నమ్మకాన్ని పొందడం కష్టమే. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఉంటే ప్రతి దాన్ని మార్చేందుకు మీకు ఒక అవకాశం వస్తుంది. ఈ మేరకు ఎదురుచూడాలి అని సూచించారు. చరిత్రలో విద్యా వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిన ఘటనలను సుంద‌ర్ పిచాయ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి బదులు వీడియో కాన్ఫరెన్స్‌ వేదికగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2020 గ్రాడ్యుయేట్లకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు గూగుల్‌ ఫ్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ ఒక విర్చువల్‌ కార్యక్ర మాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో యూఎస్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, మాజీ మొదటి మహిళ మిచెల్లి ఒబామా, కోరియన్‌ పాప్‌ గ్రూప్‌ బీటీఎస్‌, సింగర్లు బియొన్స్‌, లేడీ గాగా, సామాజిక ఉద్యమ కారిణి మలాలా యూసుఫ్‌ జయ్‌ పాల్గొన్నారు.
ఉన్నత విద్య కోసం అమెరికాలో అడుగు పెట్టిన తొలి నాళ్లను ఈ సందర్భంగా సుందర్‌ పిచాయ్‌ గుర్తుచేసుకున్నారు. అమెరికా వెళ్లేందుకు విమాన టికెట్‌ కోసం ఏడాది జీతాన్ని మా నాన్న ఖర్చు పెట్టారు. కాబట్టే నేను స్టాన్‌ఫోర్డ్‌ చదువుకున్నాను. నేను విమానం ఎక్కడం అదే తొలిసారి. కంప్యూటింగ్‌ సమ యంలో జీవితంలోవెలుగు కనిపించింది. అదృష్టం కంటే ఎక్కువ పొందాను. టెక్నాల జీపై అమితమైన అభిరుచి, కొత్త విషయాలను తెలుసుకోవాల‌నే ఆరాటం.. ఉండడం ఎంతోగానే దోహదపడ్డాయని సుంద‌ర్ పిచాయ్ త‌న ప్ర‌స్థానాన్ని వివరించారు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.