హ్యాపీ బర్త్ డే ‘గూగుల్’

ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టమే. అలాగని.. అందరితో అన్ని విషయాల గురించి అడిగి తెలుసుకోలేం. అలాంటి.. సమయంలోనే.. గూగుల్ ప్రత్యక్ష్యమయింది. ప్రపంచంలో.. ఏమూలలో జరిగిందైనా.. ఇట్టే మన కళ్లముందు ప్రత్యక్ష్యమవుతోంది. పాలిటిక్స్, సినీ ప్రముఖుల బయోగ్రఫీలు, రాజకీయ నేతల బయోగ్రఫీలు, హెల్త్ గురించి, లైఫ్ స్టైల్‌ గురించి.. ఒకటేంటి.. ఎన్నో విషయాలు ఇప్పుడు గూగుల్ దయ వల్ల మన కళ్లముందే ప్రత్యక్ష్యమవుతున్నాయి. మనం చూడని వింతలు కూడా.. ఫొటోల […]

హ్యాపీ బర్త్ డే 'గూగుల్'
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 6:00 PM

ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అన్ని తెలుసుకోవాలంటే చాలా కష్టమే. అలాగని.. అందరితో అన్ని విషయాల గురించి అడిగి తెలుసుకోలేం. అలాంటి.. సమయంలోనే.. గూగుల్ ప్రత్యక్ష్యమయింది. ప్రపంచంలో.. ఏమూలలో జరిగిందైనా.. ఇట్టే మన కళ్లముందు ప్రత్యక్ష్యమవుతోంది. పాలిటిక్స్, సినీ ప్రముఖుల బయోగ్రఫీలు, రాజకీయ నేతల బయోగ్రఫీలు, హెల్త్ గురించి, లైఫ్ స్టైల్‌ గురించి.. ఒకటేంటి.. ఎన్నో విషయాలు ఇప్పుడు గూగుల్ దయ వల్ల మన కళ్లముందే ప్రత్యక్ష్యమవుతున్నాయి. మనం చూడని వింతలు కూడా.. ఫొటోల రూపంలో చూస్తున్నాం. కాగా.. చాలా విషయాలు గూగుల్ ద్వారానే తెలుసుకుంటున్నాం. అలాగే.. గూగుల్ కూడా మన దైనందిన జీవితంలో.. ఒక భాగమైపోయింది. ఇప్పుడు గూగుల్ గురించి ప్రస్తావన ఎందుకొచ్చిందంటారా..? ఈ రోజు గూగుల్ వచ్చిన రోజు.. అంటే పుట్టిన రోజని అర్థం.

ప్రస్తుతం ఇప్పుడు గూగుల్.. 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. 1998 సెప్టెంబర్ 27న గూగుల్‌ని లాంచ్ చేశారు. గూగుల్ రాకముందు.. ఏవిషయం గురించైనా వెతకాలంటే.. ఎన్నో పుస్తకాలను.. పేపర్లను తిరగేయాల్సి వచ్చేది. దీంతో.. చాలా సమయం వృథా అయ్యేది. గూగుల్ ప్రాచూర్యంలోకి వచ్చిన తరువాత.. అన్ని విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. కేవలం ఇంగ్లీషులోనే కాకుండా.. పలు భాషల్లో.. కూడా గూగుల్ నుంచి మనం వివరాలు తెలుసుకోవచ్చు. తెలుగు, మళయాళం, కన్నడ, కర్ణాటక, తమిళం, హిందీ, ఇంగ్లీషు ఇలా పలు భాషల్లో.. గూగుల్.. సమాచారం తెలియజేస్తుంది.

ఎన్నో కంపెనీలకు గట్టి పోటీని ఇచ్చి తట్టకోని.. ఉన్నత శిఖరాలకు చేరింది గూగుల్. 21 ఏళ్ల క్రితం ప్రారంభమైన గూగుల్ ఇప్పుడు క్రమంగా అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వందల బిలియన్ల వెబ్ పేజీలను కలిగి ఉంది. ఇక యాడ్స్ రూపంలో.. దూసుకుపోతోంది. దీంతో.. ఓ రేంజ్‌లో గూగుల్‌కు భారీ ఆదాయం కలుగుతోంది.

ఇప్పుడు ఎంతలా.. గూగుల్ ప్రజలకు దగ్గర అయిపోయిందంటే.. ఏ విషయం గురించైనా మనకు తెలియకపోతే.. ‘గూగుల్ ఇట్’ అనేస్తున్నారు. ఈరోజు గూగుల్ బర్త్ డే సందర్భంగా.. గూగుల్ ఓ స్పెషల్ డూడుల్‌ను తయారు చేసింది. పాతకాలం నాటి కంప్యూటర్ మానిటర్‌పై గూగుల్ సెర్చ్ పేజీని చూపిస్తూ.. ప్రత్యేక డూడుల్‌ను రూపొందించారు. దీనిపై సెప్టెంబర్ 27, 1998 తేదీని చూపించారు. ఏదైనా ప్రత్యేకమైన రోజున కూడా.. గూగుల్ ఓ న్యూ డూడుల్ కనిపిస్తోంది. మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న గూగుల్.. క్రమక్రమేనా.. ప్రజలకు దగ్గరవుతూ వచ్చింది. ఇప్పుడు.. ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది. కాగా.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గూగుల్ సంస్థను అధికారికంగా ప్రారంభించింది సెప్టెంబర్ 4, 1998 అయినా.. సెప్టెంబర్ 27నే ‘గూగుల్ బర్త్ డే’గా నిర్వహిస్తున్నారు. దీనికి కారణమేంటనేది ఇప్పటివరకూ గూగుల్ యాజమాన్యం బయటపెట్టలేదు.