మందుబాబులకు గుడ్ న్యూస్.. మాల్స్‌లో మద్యం సేల్స్..

మందుబాబులకు యోగీ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. విదేశీ మద్యాన్ని షాపింగ్ మాల్స్‌లో అమ్ముకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కేవలం సీల్డ్ బాటిల్స్ మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్.ఆర్ భూస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎక్సయిజ్ కమీషన్ అనుమతులు పొందిన నిర్ధారిత బ్రాండ్‌లకు చెందిన విదేశీ మద్యాన్ని మాత్రమే ప్రీమియం రిటైల్ షాపులు విక్రయించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. దిగుమతి చేసుకున్న విదేశీ లిక్కర్ […]

మందుబాబులకు గుడ్ న్యూస్.. మాల్స్‌లో మద్యం సేల్స్..
Follow us

|

Updated on: May 25, 2020 | 12:06 PM

మందుబాబులకు యోగీ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. విదేశీ మద్యాన్ని షాపింగ్ మాల్స్‌లో అమ్ముకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కేవలం సీల్డ్ బాటిల్స్ మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్.ఆర్ భూస్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఎక్సయిజ్ కమీషన్ అనుమతులు పొందిన నిర్ధారిత బ్రాండ్‌లకు చెందిన విదేశీ మద్యాన్ని మాత్రమే ప్రీమియం రిటైల్ షాపులు విక్రయించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. దిగుమతి చేసుకున్న విదేశీ లిక్కర్ బ్రాండ్లతో పాటు ఇండియన్-మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) స్కాచ్, జిన్, వైన్, వోడ్కా, రమ్ బ్రాండ్లన్నింటిని అమ్ముకోవచ్చునని తెలిపింది.

ఈ మధ్యకాలంలో ఎక్కువమంది మాల్స్‌లోనే షాపింగ్ చేయడం ట్రెండ్‌గా మారాడటంతో.. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలను అనుమతించేలా నిబంధనలు రూపొందించినట్లు భూస్‌రెడ్డి వెల్లడించారు. కాగా, మాల్స్‌లో అందరూ కూడా కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా.. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.