సోషల్ మీడియా వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్..!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా యూజర్స్‌లో తలెత్తిన ఆందోళనకు ఎట్టకేలకు కేంద్రం చెక్ పెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ యూజర్లు పెరిగారని.. వారికి చెక్ పెట్టాలంటే.. సోషల్ మీడియా అకౌంట్స్‌కు ఆధార్ లింక్ చేయాలంటూ పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింక్ తప్పదేమోనని వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే దీనిపై కేంద్రం పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. […]

సోషల్ మీడియా వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 3:45 PM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా యూజర్స్‌లో తలెత్తిన ఆందోళనకు ఎట్టకేలకు కేంద్రం చెక్ పెట్టింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ యూజర్లు పెరిగారని.. వారికి చెక్ పెట్టాలంటే.. సోషల్ మీడియా అకౌంట్స్‌కు ఆధార్ లింక్ చేయాలంటూ పలువురు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లింక్ తప్పదేమోనని వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే దీనిపై కేంద్రం పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ లింక్ చేయాలన్న ప్రణాళికలేవీ ప్రభుత్వం వద్ద లేవని స్పష్టం చేసింది.

అంతేకాదు.. ఆధార్‌కు సంబంధించిన సమాచారం కూడా పూర్తి సురక్షితంగా ఉందని.. రెగ్యులర్‌గా ఆడిట్ కూడా జరుగుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ఓ ప్రశ్నకు సమాదానం ఇచ్చారు. ఈ సందర్భంగా.. ఐటీ చట్టం 2000లోని సెక్షన్‌ 69ఏ కింద ప్రజా ప్రయోజనాల కోసం.. కొన్ని (అనుమానిత, వివాదాస్పద) అకౌంట్స్‌ను తొలగించే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపారు. 2016 నుంచి 2019 వరకు దాదాపు తొమ్మిది వేల అకౌంట్ల యూఆర్ఎల్‌లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు.