ఈపీఎఫ్‌వో నయా రూల్స్.. ఉద్యోగులకు శుభవార్త!

ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) తీపికబురు తీసుకురాబోతోంది. కొత్త రూల్స్‌ను ఆవిష్కరించనుంది. కేంద్ర కార్మిక శాఖ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్కువ మంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకోబోతోంది.ఈపీఎఫ్‌వో తన 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు అదనంగా మరో 50 లక్షల మందికి సామాజిక భద్రత కల్పించాలని భావిస్తోంది. వీరికి కూడా ఇకపై పీఎఫ్ డబ్బులు కట్ కనున్నాయి. ఈపీఎఫ్‌వో కొత్త నిర్ణయం […]

ఈపీఎఫ్‌వో నయా రూల్స్.. ఉద్యోగులకు శుభవార్త!
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2019 | 7:12 PM

ఉద్యోగులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌వో) తీపికబురు తీసుకురాబోతోంది. కొత్త రూల్స్‌ను ఆవిష్కరించనుంది. కేంద్ర కార్మిక శాఖ కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎక్కువ మంది ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకోబోతోంది.ఈపీఎఫ్‌వో తన 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు అదనంగా మరో 50 లక్షల మందికి సామాజిక భద్రత కల్పించాలని భావిస్తోంది. వీరికి కూడా ఇకపై పీఎఫ్ డబ్బులు కట్ కనున్నాయి. ఈపీఎఫ్‌వో కొత్త నిర్ణయం 2020 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.

ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం సాధారణంగా 20 మంది లేదా ఆపైన ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలు వర్తిస్తాయి. ఈమేరకు ఉద్యోగులను కలిగిన సంస్థలు మాత్రమే ఈపీఎఫ్ యాక్ట్ కింద ఎంప్లాయీస్‌కు ఈపీఎఫ్ సభ్యత్వం కల్పించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పరిమితిని 10 మంది ఉద్యోగులకు తగ్గించిందని జాతీయ మీడియా పేర్కొంటోంది. దీంతో రానున్న రోజుల్లో కంపెనీలో 10 లేదా ఆపైన ఎక్కువ మంది ఉన్న కూడా ఈపీఎఫ్ వర్తిస్తుంది.

2008 జూలైలోనే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ 183వ సమావేశంలోనే 10 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు కూడా ఈపీఎఫ్ వర్తింపు ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది . అయితే అప్పటి నుంచి ఇది అమలు కాలేదు. తాజాగా కేంద్ర కార్మిక శాఖకు కొత్త రూల్ అమలుకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.

ఈపీఎఫ్‌వో సీనియర్ అధికారి ప్రకారం.. కేంద్ర కార్మిక శాఖ దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. లేబర్ చట్టాల సవరణకు పార్లమెంట్ ఆమోదం అవసరం లేదని ఆయన తెలిపారు. కొత్త ప్రతిపాదనలు 2020 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం