Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్…త్వరలో అదిరిపోయే సర్వీస్

You can soon deposit cash at any ATM, బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్…త్వరలో అదిరిపోయే సర్వీస్

బ్యాంకులు తమ కస్టమర్స్‌కి ఇచ్చే సర్వీసుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఒక బ్యాంక్ కస్టమర్, మరో బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు వేసుకునేలా.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్దం చేసింది. అంతేకాదు వేరే బ్యాంక్ ఏటిఎం సెల్ఫ్ డిపాజిట్ మెషీన్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఇచ్చిన సలహాలపై దేశంలోని వివిధ బ్యాంకులు సమాలోచనలు చేస్తున్నాయి. దేశంలో అన్ని రకాల చెల్లింపులకు సంబంధించిన బాధ్యతలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తుంది.

క్యాష్ డిపాజిట్ ఇంటర్ ఆపరబిలిటీ సేవల వల్ల బ్యాంకులతో పాటు ఖాతాదారులు కూడా చాల ప్రయోజనాలు పొందవచ్చని ఎన్‌సీపీఐ ఆధారాలను చూపుతుంది. నగదు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ ఆపరేషన్స్ ద్వారా ఇది సాధ్యమేనంటూ పేర్కొంది. ఈ ప్రతిపాదనకు 14 బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి.  ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. దాదాపు 30,000 వేల పైచిలుకు ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్స్‌(ఎటిఎమ్స్)లో ఇంటర్ ఆపరబిలిటీ సర్విసెస్ వెసులుబాటు కల్పించవచ్చని, దీనికి టెక్నికల్ ఇబ్బందులు కూడా పెద్దగా ఉండవంటూ ఎన్‌పీసీఐ వెల్లడించింది. ఇక ఈ సర్వీసెస్‌కు ఛార్జీలు కూడా నిర్ణయించారు. ఒక బ్యాంకు కస్టమర్, మరో బ్యాంకుకిగానీ, ఏటీఎంకి గానీ వెళ్లి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే.. రూ. 10,000లోపు అయితే రూ.25, రూ.10,000 దాటితే రూ.50 ఛార్జస్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటీఎంలో నగదు డిపాజిట్ చెయ్యడం వల్ల నకిలీ నోట్లు ప్రభావం ఎక్కువగా సర్కులేట్ అయ్యే అవకాశం ఉంటడంతో చాలా బ్యాంకులు ఈ సర్విసెస్‌పై తర్జనభర్జనలు పడుతున్నాయి. ఇందుకోసం ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసే దిశలో కూడా ఆలోచనలు చేస్తున్నాయి.

 

Related Tags