ఏపీలో 5 విమానాశ్రయాల అభివృద్ధికి రూ.651 కోట్లు…

Good News From Central Government: ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాల అభివృద్ధికి గానూ రూ.651 కోట్లను కేటాయించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌ 31నాటికి రూ.414 కోట్లు ఖర్చయినట్లు రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విజయవాడలో రన్‌వే బలోపేతం, విస్తరణకు రూ.145 కోట్లు కేటాయించగా.. రూ.155 కోట్లు ఖర్చయిందని మంత్రి హర్‌దీప్ సింగ్ తెలిపారు. […]

ఏపీలో 5 విమానాశ్రయాల అభివృద్ధికి రూ.651 కోట్లు...
Follow us

| Edited By:

Updated on: Feb 07, 2020 | 5:48 AM

Good News From Central Government: ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాల అభివృద్ధికి గానూ రూ.651 కోట్లను కేటాయించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌ 31నాటికి రూ.414 కోట్లు ఖర్చయినట్లు రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

విజయవాడలో రన్‌వే బలోపేతం, విస్తరణకు రూ.145 కోట్లు కేటాయించగా.. రూ.155 కోట్లు ఖర్చయిందని మంత్రి హర్‌దీప్ సింగ్ తెలిపారు. రాజమహేంద్రవరం రన్‌వే పొడిగింపు, యాప్రాన్, ఫ్లడ్ లైట్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ.176 కోట్లు.. అలాగే కడప ఎయిర్ పోర్టులో వేర్వేరు అభివృద్ధి పనులకు రూ.33 కోట్లు, విశాఖపట్నం విమానాశ్రయానికి రూ.27 కోట్లు ఖర్చయినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

తిరుపతి విమానాశ్రయం రన్‌వే పొడిగింపుకు రూ.21 కోట్లు ఖర్చు చేసినట్లు హర్‌దీప్ సింగ్ స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ రీసర్చ్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.353.61 కోట్లు కేటాయించామని.. వాటికి సంబంధించిన పనులు ఇంకా మొదలుకాలేదని ఆయన వెల్లడించారు.