ఐఐటీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పరీక్షలు..!

కరోనా వైరస్ కారణంగా ఉన్నత విద్యలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు యూనివర్సిటీలు ఆన్లైన్ విద్యా విధానంపై కసరత్తులు చేస్తుండగా.. తాజాగా పరీక్షలను కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించేలా ఐఐటీ(భువనేశ్వర్‌) సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసే విధంగా విద్యార్థులకు ఇంటి నుంచి పరీక్షలు నిర్వహించారు. ఈ టెక్నాలజీ ద్వారా విద్యార్థి తన ఇంటి దగ్గర నుంచి లేదా మరెక్కడ నుంచి అయినా కంప్యూటర్ ద్వారా […]

ఐఐటీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పరీక్షలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 25, 2020 | 1:33 PM

కరోనా వైరస్ కారణంగా ఉన్నత విద్యలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు యూనివర్సిటీలు ఆన్లైన్ విద్యా విధానంపై కసరత్తులు చేస్తుండగా.. తాజాగా పరీక్షలను కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించేలా ఐఐటీ(భువనేశ్వర్‌) సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేసే విధంగా విద్యార్థులకు ఇంటి నుంచి పరీక్షలు నిర్వహించారు.

ఈ టెక్నాలజీ ద్వారా విద్యార్థి తన ఇంటి దగ్గర నుంచి లేదా మరెక్కడ నుంచి అయినా కంప్యూటర్ ద్వారా పరీక్షలు రాసేయొచ్చు. ఇన్విజిలేషన్, క్వశ్చన్ పేపర్ ఇవ్వడం, ఆన్సర్ పేపర్ సబ్మిట్ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని.. కావాలంటే జవాబు పత్రాన్ని ప్రింట్ తీసుకునే సౌకర్యం కూడా ఉంటుందని ఐఐటీ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఈ కొత్త టెక్నాలజీతో దేశవ్యాప్తంగా సుమారు 240 మంది విద్యార్థులకు 31 సబ్జెక్టులకు పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని ఐఐటీ డైరెక్టర్‌ ఆర్వీ రాజా కుమార్‌ వెల్లడించారు.