దివాలా తీసిన చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు కేంద్రం శుభ‌వార్త..

ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల దివాలా తీసిన కుటీర, చిన్న, మధ్య తరహా ప‌రిశ్ర‌మ‌ల‌(ఎంఎస్‌‌ఎంఈల) కోసం త్వరలోనే ఓ ప్ర‌త్యేక ప‌థ‌కం తీసుకురానున్నట్టు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది

దివాలా తీసిన చిన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు కేంద్రం శుభ‌వార్త..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 6:59 PM

ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల దివాలా తీసిన కుటీర, చిన్న, మధ్య తరహా ప‌రిశ్ర‌మ‌ల‌(ఎంఎస్‌‌ఎంఈల) కోసం త్వరలోనే ఓ ప్ర‌త్యేక ప‌థ‌కం తీసుకురానున్నట్టు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కోవిడ్-19 కార‌ణంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతోన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు భ‌రోసా ఇచ్చేందుకు తీసుకునే చర్యలపై ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం సమీక్ష నిర్వ‌హించారు. ఎంఎస్‌‌ఎంఈలకు స్వాంత‌న చేకూర్చేందుకు ఇన్‌‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌‌రప్ట్‌‌స్సీ కోడ్ కింద స్పెషల్ ఇన్‌‌సాల్వెన్సీ రిజొల్యూషన్‌‌ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫైన‌ల్ చేస్తోంద‌ని అధికారక ప్రకటనలో కేంద్రం పేర్కొంది. ఇన్‌‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌‌రప్ట్‌‌స్సీ కోడ్ కిందనున్న సెక్షన్ 240ఏ కింద ఈ ప‌థ‌కం నోటిఫై చేయనుంది.

చిన్న వ్యాపారాల కోసం ఈ బ్యాంక్‌‌రప్ట్‌‌స్సీ కోడ్ మోడిఫైడ్ వెర్షన్‌‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కోడ్ లో ఉన్న సెక్షన్ 29ఏ నుంచి కుటీర, చిన్న, మధ్య తరహా ప‌రిశ్ర‌మ‌ల కోసం ఒక మేజర్ మినహాయింపు ఉంది. కంపెనీల మేజర్ షేర్‌ ‌‌‌హోల్డర్స్‌‌ కనుక డిఫాల్ట్ అయితే, ఈ ప‌థ‌కం కింద రిజొల్యూషన్‌‌లో పాలు పంచుకోవడానికి వీలు కుద‌ర‌దు. జూన్‌‌లో గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌‌సాల్వెన్సీ కోడ్‌‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. కరోనా లాక్‌‌డౌన్‌‌తో మార్చి 25 తర్వాత డిఫాల్ట్స్ అయిన వ్యాపారాలను ఏ లెండర్లు కూడా ట్రిబ్యునల్స్ ముందు నిల‌బెట్ట‌లేదు. కోవిడ్-19 కార‌ణంగా ఏర్పడిన నష్టాలతో, ఇబ్బందులు పాలవుతున్న వ్యాపారాలకు కేంద్రం పలు ఊరట చర్యలను అనౌన్స్ చేసింది. కంపెనీల యాక్ట్, ఇన్‌‌కమ్ ట్యాక్స్ యాక్ట్ కిందనున్న పలు చట్టాల్లో ఫైన‌ల్ గ‌డువులు పొడిగించింది. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం ఆర్థిక మంత్రి పలు స‌డ‌లింపులు సైతం ఇచ్చారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ ప‌థ‌కం కింద గ‌వ‌ర్న‌మెంట్ ప్రకటించిన రూ.1.2 లక్షల కోట్లలో బ్యాంక్‌‌లు ఇప్పటి వరకు రూ.61,988 కోట్లను రిలీజ్ చేసినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..