Special Train: ‌రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. 27వ తేదీ నుంచి ప‌లు మార్గాల్లో ప్ర‌త్యేక రైళ్లు

Special Train: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది. కాచిగూడ‌-య‌ల‌హంక ప్ర‌త్యేక రైలును న‌డుపుతున్న‌ట్లు..

Special Train: ‌రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. 27వ తేదీ నుంచి ప‌లు మార్గాల్లో ప్ర‌త్యేక రైళ్లు
Follow us

|

Updated on: Jan 26, 2021 | 5:57 AM

Special Train: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది. కాచిగూడ‌-య‌ల‌హంక ప్ర‌త్యేక రైలును న‌డుపుతున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 27వ తేదీ నుంచి ఈ రైలు న‌డుస్తుంద‌ని తెలిపారు. అదే విధంగా తిరుగు ప్ర‌యాణంలో య‌లహంక‌- కాచిగూడ ఈ నెల‌28 నుంచి ప్ర‌తి రోజు న‌డుస్తుంద‌ని వెల్ల‌డించారు. కాచిగూడ‌లో రాత్రి 9.05 గంట‌ల‌కు బ‌య‌లుదేరి య‌ల‌హంక‌కు మ‌రుస‌టి రోజు ఉద‌యం 9.35 గంట‌ల‌కు చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ నుంచి బ‌య‌లుదేరి షాద్‌న‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గర్‌, గ‌ద్వాల్‌, క‌ర్నూలు సిటీ, ద్రోణాచ‌లం, గుంత‌క‌ల్ , అనంత‌పురం, ధ‌ర్మ‌వ‌రం, పెనుగొండ‌, హిందూపూర్‌ల మీదుగా గౌరిబిద‌నూరు, దోడ్‌బ‌ల్లాపూర్ స్టేష‌న్‌ల మీదుగా రాక‌పోక‌లు సాగిస్తుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

అలాగే సికింద్రాబాద్‌- మ‌ణుగూరు, మ‌ణుగూరు- సికింద్రాబాద్‌, గుంటూరు- రాయ‌గ‌డ‌, తిరుప‌తి- ఆదిలాబాద్‌, ఆదిలాబాద్ – తిరుప‌తి, కాకినాడ పోర్టు – రేణిగుంట రైళ్లు ఈనెల 27 నుంచి ప్ర‌తిరోజు నిర్దేశిత మార్గాల్లో రాక‌పోక‌లు సాగిస్తాయ‌ని వెల్ల‌డించారు. ఈ సౌక‌ర్యాన్ని ప్ర‌యాణికులు వినియోగించుకోవాల‌ని కోరారు. అయితే ప్ర‌యాణికులు ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌కు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్నామ‌ని తెలిపారు.

WhatsApp Privacy Policy: వాట్సాప్ నూత‌న ప్రైవ‌సీ పాల‌సీపై కేంద్ర స‌ర్కార్ ఆగ్ర‌హం.. హైకోర్టులో విచార‌ణ‌

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!