ఏపీ పెన్షనర్లకు జగన్ గోల్డెన్ గిఫ్ట్

ఏపీలోని కోట్లాది మంది పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం గోల్డెన్ గిఫ్ట్ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి పెన్షనర్ల ఇంటి వద్దకే పెన్షన్ మొత్తాలు చేరేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు– నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌ అంశాలపై ఆయన సమీక్ష జరిపారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా […]

ఏపీ పెన్షనర్లకు జగన్ గోల్డెన్ గిఫ్ట్
Follow us

|

Updated on: Jan 08, 2020 | 4:24 PM

ఏపీలోని కోట్లాది మంది పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం గోల్డెన్ గిఫ్ట్ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి పెన్షనర్ల ఇంటి వద్దకే పెన్షన్ మొత్తాలు చేరేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు– నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌ అంశాలపై ఆయన సమీక్ష జరిపారు.

గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. తర్వాత మినీ గోడౌన్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ నిధులతో స్కూళ్లకు ప్రహరీ గోడలను నిర్మించాలని ఆదేశాలిచ్చారు జగన్.

ఫిబ్రవరి నెల నుంచి ఇంటివద్దకే పెన్షన్ల మొత్తాలను పంపించాలని, పెన్షనర్లకు గ్రామ, వార్డు వాలెంటీర్ల ద్వారా పెన్షన్ మొత్తాలను పంపిణీ చేయాలని సీఎం నిర్దేశించారు. పెన్షన్ల కోసం ఎదురుచూపులు, వేచి చూసే పరిస్థితి లేకుండా చేయాలన్నారు. సర్వేలతో ముడిపెట్టి ఇళ్లపట్టాలను నిరాకరించవద్దని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. ఆమేరకు లబ్ధిదారులను గుర్తించాలని, అర్హులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేని జగన్ ఆదేశించారు.

కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, వీటిద్వారా మరో 3 వేలకు పైగా ఉద్యోగాలివ్వాలని సీఎం చెప్పారు. గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 15 వేల 971ల ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆయన నిర్దేశించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?