ఈ మెడిసిన్‌తో మైగ్రేన్ చిటికెలో మాయం..!

మైగ్రేన్ తలనొప్పి..దీని టార్చర్ అంతా ఇంతా కాదు.. ఆ బాధ.. దానిని భరించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే..ఈ తలనొప్పితో బాధపడుతున్న వారికి కొన్ని సందర్బాల్లో తల పగిలిపోతుందేమోనని, లేదంటే..తమకు తాముగా నొప్పి భరించలేక చనిపోదామా అనిపిస్తుందట.. నెలలో దాదాపు పాతిక రోజులు తలనొప్పితో బాధపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. విద్యార్థులు మొదలు..ఉద్యోగుస్తులు మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా.. మైగ్రేన్ అందరిని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య.  దీంతో చదువుపై, అటు […]

ఈ మెడిసిన్‌తో మైగ్రేన్ చిటికెలో మాయం..!
Follow us

| Edited By:

Updated on: Nov 29, 2019 | 5:37 PM

మైగ్రేన్ తలనొప్పి..దీని టార్చర్ అంతా ఇంతా కాదు.. ఆ బాధ.. దానిని భరించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే..ఈ తలనొప్పితో బాధపడుతున్న వారికి కొన్ని సందర్బాల్లో తల పగిలిపోతుందేమోనని, లేదంటే..తమకు తాముగా నొప్పి భరించలేక చనిపోదామా అనిపిస్తుందట.. నెలలో దాదాపు పాతిక రోజులు తలనొప్పితో బాధపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. విద్యార్థులు మొదలు..ఉద్యోగుస్తులు మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా.. మైగ్రేన్ అందరిని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య.  దీంతో చదువుపై, అటు చేసే పనిపై కూడా బాధితులు శ్రద్ద పెట్టలేకపోతుంటారు. ఇక ఈ బాధలన్నింటికీ ఇప్పుడు చెక్ చెప్పవచ్చు. ఎందుకంటే.. మైగ్రేన్ బాధితుల కోసం లాస్మిడిటాన్ అనే మందు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) ఆమోదం పొందింది. ట్రయల్స్ ముగించుకుని త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లుగా ప్రముఖ మెడికల్ జర్నల్ జామాలో కథనాన్ని ప్రచురించారు.

మైగ్రేన్ బాధితులకు ఊరటనిచ్చే ఈ మందుకు ’ఉబ్రోజపాంట్‘గా నామకరణం చేశారు. అయితే, ఈ లాస్మిడిటాన్ మందు వాడిన తర్వాత కనీసం 8 గంటల పాటు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలట. అదొక్కటే ఈ మందుతో ఇబ్బందని నిపుణులు చెప్పారు. ప్రస్తుతం మైగ్రేన్‌కు వాడుతున్న మందులు..రక్తనాళాలను కాస్తంత సన్నబరిచేలా చేసి, బాధ ఉన్నచోట రక్తం ఒకింత తక్కువ అందేలా చేయడం ద్వారా పనిచేస్తాయి. అయితే, వాటితో చికిత్స గుండెజబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన వాస్కులర్ జబ్బులు ఉన్నవారికి అంతమంచిది కాదంటున్నారు. అలాంటివారిలో అది గుండెపోటు, లేదా పక్షవాతానికి కారణం కావచ్చునని సూచిస్తున్నారు.  కానీ, లాస్మిడిటాన్(ఉబ్రోజాపాంట్) వాడితే  ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు. కేవలం తలనొప్పికి కారణమైన ప్రోటీన్ ను మాత్రమే టార్గెట్ చేసేలా ఈ మందు పనిచేస్తుందట. దాంతో నొప్పి కలిగించే ఆ ప్రోటీన్ పై దాడి చేయడం ద్వారా వారి తలనొప్పి, ఇతర ఇబ్బందులను అరికట్టవచ్చని చెబుతున్నారు. ఇది నిజంగానే మైగ్రేన్ బాధితులకు మంచి గుఢ్ న్యూస్ అంటున్నారు వైద్య నిపుణులు.