Breaking News
 • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
 • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
 • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
 • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
 • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
 • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
 • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

రేపటి నుంచి ‘రైతులకు మహార్దశ’.. ఎందుకంటే..?

ఏపీ సర్కార్‌.. రైతులకు తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసాను రేపటి నుంచి అమలు చేయబోతున్నట్లు వైసీపీ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైతులకు మరో వెయ్యి అందనంగా అంటే.. మొత్తం ఇప్పుడు 13,500 ఇవ్వబోతున్నట్లు నిర్ణయించారు. వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్ సుధీర్ఘ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మంత్రి కన్నబాబు.

కీ పాయింట్స్:

 • రైతు భరోసాకింద ఇచ్చే మొత్తం మరో వేయి రూపాయలు పెంపు
 • రూ.12,500కు బదులు రూ.13,500 ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయం
 • నాలుగేళ్లపాటు రూ.12,500 ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ
 • ఇప్పుడు 5 ఏళ్లపాటు రూ.13,500లు ఇస్తున్న ప్రభుత్వం
 • రైతుభరోసా నాలుగేళ్లనుంచి ఐదేళ్లకు పెంపు
 • నాలుగేళ్లలో రూ.50వేలకు బదులు రూ.67,500
 • ఇచ్చిన హామీ కంటే రూ.17,500 అధికంగా ఇస్తున్న ప్రభుత్వం
 • వ్యవసాయ మిషన్‌లో రైతు ప్రతినిధుల డిమాండ్‌ మేరకు ఏటా ఇచ్చే సహాయాన్ని పెంచేందుకు సీఎం అంగీకారం
 • రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు కీలక సందర్భాల్లో పెట్టుబడి సహాయం చేయాలన్న రైతు ప్రతినిధులు
 • రైతులు, రైతు ప్రతినిధుల డిమాండ్లను సీఎంకు వివరించిన వ్యవసాయ మిషన్‌ సభ్యులు
 • మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ
 • మేనెలలో రూ.7,500, ఖరీఫ్‌ పంట కోసే సమయంలో, రబీ అవసరాలకోసం రూ.4000, సంక్రాంతి పండుగ సమయంలో రూ.2వేలు
 • రేపు నెల్లూరులో ’’వైయస్సార్‌ రైతు భరోసా’’ కార్యక్రమం ప్రారంభం.
 • రైతులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలురైతులకు, భూములపై హక్కులున్న రైతులకు దేశ చరిత్రలోనే అత్యధికంగా సహాయం అందిస్తున్న శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం