Breaking News
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.35 కోట్లు మంజూరు. పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం. 627 మంది రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించనున్న ప్రభుత్వం.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత. 11.68 కిలోల నల్ల మందు, ఐదు కిలోల సూడోఫెడ్రిన్‌ స్వాధీనం. డ్రగ్స్‌ విలువ రూ.రెండున్నర కోట్లు ఉంటుందని అంచనా. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేసిన అధికారులు.
  • ఏపీఈఆర్సీ సభ్యులను నియమించిన ప్రభుత్వం. పి.రాజగోపాల్‌, ఠాకూర్‌ రామసింగ్‌ను సభ్యులుగా పేర్కొంటూ ఉత్తర్వులు.
  • కర్నూలు: శ్రీశైలంలో అధికారుల అత్యుత్సాహం. గోపురానికి పాగ కట్టేవారి కుటుంబ సభ్యులను అనుమతించని అధికారులు. అధికారుల తీరుపై మండిపడుతున్న భక్తులు.
  • ప్రధాని మోదీతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌థాక్రే భేటీ. సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్సీపై ప్రధానితో చర్చించాం. ఈ అంశాలపై ఇప్పటికే మా వైఖరి తెలియజేశాం-ఉద్ధవ్‌థాక్రే. సీఏఏపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల పౌరసత్వాన్ని సీఏఏ హరించదు-ఉద్ధవ్‌థాక్రే.

అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్

, అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందే సమయం వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవడంతో సీఐడీ అధికారులు డిపాజిటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఏ విభాగంలో ఎంత మంది ఉన్నారు, వారిలో డేటా మ్యాచ్‌ అయిన వారెందరు, కాని వారి సంఖ్య ఎంత, ఎవరెవరికి ఎంత ఇస్తే ఎంతమందికి న్యాయం జరుగుతుంది అనే వివరాలతో జాబితాను సిద్ధం చేశారు సీఐడీ అధికారులు. రూ. 20వేలు లోపు డిపాజిట్‌ చేసిన వారికి ఆగస్టులో క్లియర్‌ చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనికోసం అవసరమైన రూ.1,429కోట్లలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,150కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. గత ప్రభుత్వం కేటాయించిన 250 కోట్లు, అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించిన కొన్ని ఆస్తులను అమ్మగా వచ్చిన నిధులను కలుపుకొని.. ఈ డిపాజిటర్లకు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.

ఈ మేరకు సీఐడీ అధికారులు తన జాబితాను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. దానిని పరిశీలన కోసం జిల్లాల్లోని న్యాయ కమిటీలకు పంపి ఆ తర్వాత హైకోర్టు అనుమతితో డబ్బులు పంపిణీ చేయబోతున్నారు. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోని రూ.3,785కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను గుర్తించి సీఐడీ జప్తు చేసింది. అందులో అత్యధికంగా మన రాష్ట్రంలో రూ.2,585 కోట్లు విలువైన ఆస్తులు జప్తులో ఉన్నాయి. వాటిని వేలంలో విక్రయించి డిపాజిటర్లకు పంపిణీ చేయాలని మూడేళ్ల క్రితం డిపాజిటర్ల సంఘం పేరుతో హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను జిల్లా కమిటీలతో కలిసి సీఐడీ అధికారులు మొదలుపెట్టారు. ఇక త్వరలోనే అగ్రిగోల్డ్ బాధితులను సీఎం జగన్ నేరుగా కలుసుకోనున్నారు.

Related Tags