రేసిజంపై నిరసన.. ‘గాన్ విత్ ది విండ్’ మూవీ కి ‘సెగ’ !

జార్జి ఫ్లాయిడ్ హత్యతో అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాల్లో  రేసిజానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనల సెగ ' గాన్ విత్ ది విండ్'  మూవీకి కూడా సోకింది. 1939 లో రిలీజై ఆస్కార్ అవార్డు కూడా పొందిన ఈ చిత్రం..

రేసిజంపై నిరసన.. 'గాన్ విత్ ది విండ్' మూవీ కి 'సెగ' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2020 | 5:35 PM

జార్జి ఫ్లాయిడ్ హత్యతో అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాల్లో  రేసిజానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనల సెగ ‘ గాన్ విత్ ది విండ్’  మూవీకి కూడా సోకింది. 1939 లో రిలీజై ఆస్కార్ అవార్డు కూడా పొందిన ఈ చిత్రంలో జాత్యహంకారాన్ని హైలైట్ చేశారంటూ విమర్శలు వఛ్చిన నేపథ్యంలో హెచ్ బీ ఓ  మాక్స్ స్ట్రీమింగ్ నుంచి దీన్ని తొలగించారు. బానిసలు, అదే సమయంలో బానిసల్లోని హీరో పోకడలను ప్రతిబింబించిన ఈ  సినిమాపై పెద్దఎత్తున ఆగ్రహ జ్వాలలు రేగాయి. దురదృష్టవశాత్తూ నాటి అమెరికా సమాజంలో ఈ విధమైన ధోరణులు ఉండేవని, అవి నేడు కూడా కొనసాగడం తప్పిదమేనని హెచ్ బీ ఓ మాక్స్ ప్రతినిధి ఒకరు అంగీకరించారు. ఎలాంటి వివరణా ఇవ్వకుండా.. ఈ పోకడలను ఖండించకుండా ఈ చిత్రాన్ని ఇంకా ప్రదర్శించడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు.

ఈ చిత్రంలో మానవుల చర్మ రంగు, స్లేవరీ, వారి బాధలను మరీ మరీ చూపడం అసమంజసమని జాన్ రిడ్లే అనే రచయిత అభిప్రాయపడ్డారు. ’12 ఇయర్స్ ఎ స్లేవ్ అనే పుస్తకాన్ని రచించిన ఈ రైటర్.. ఇందులో రేసిజం పోకడలను తీవ్రంగా ఖండించారు. ఇలా ఉండగా.. ‘కాప్స్’ పేరిట ప్రసారమవుతున్న రియాల్టీ సీరీస్ ని పారామౌంట్ నెట్ వర్క్ నిలిపివేసింది. అలాగే ‘లైవ్ పీడీ’ అనే రియాల్టీ సీరీస్ పై  కూడా వేటు పడింది.