చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా ప‌ట్టుబ‌డ్డ బంగారం

చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. షార్జా నుండి చెన్నైకి వ‌చ్చిన ఓ ముఠా బంగారం అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. పార్సెల్ బాక్స్‌లో ఉన్న ఎల‌క్ట్రిక్ మెషిన్‌లో బంగారం అక్ర‌మంగా త‌ర‌లిస్తోన్న ముఠాను అరెస్ట్..

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా ప‌ట్టుబ‌డ్డ బంగారం
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 7:45 PM

చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. షార్జా నుండి చెన్నైకి వ‌చ్చిన ఓ ముఠా బంగారం అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. పార్సెల్ బాక్స్‌లో ఉన్న ఎల‌క్ట్రిక్ మెషిన్‌లో బంగారం అక్ర‌మంగా త‌ర‌లిస్తోన్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ బంగారానికి సంబంధించి.. వారి వ‌ద్ద ఎలాంటి ఆధారాలు లేక‌పోవ‌డంతో బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ ఎల‌క్ట్రిక్ మెషీన్‌లో 1.16 కేజీల బంగారం విలువ 64 ల‌క్ష‌లు ఉండొచ్చ‌ని అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తిరువారూర్‌కి చెందిన హుస్సేన్ అనే వ్య‌క్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు. కాగా ఇదివ‌ర‌కే చెన్నై విమానాశ్ర‌యంలో ఎన్నో సార్లు అక్ర‌మంగా త‌ర‌లించే బంగారం ప‌ట్టుబ‌డేది. నిందితులు ఎన్ని ర‌కాలుగా త‌ర‌లించినా.. క‌స్ట‌మ్స్ అధికారులు ఎంతో తెలివిగా వ్య‌వ‌హ‌రించి బంగారాన్ని గుర్తించేవారు.

Also Read:

జ‌గ‌న‌న్న‌కి, వ‌దిన‌మ్మ‌కి పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు: ఎమ్మెల్యే రోజా

క‌రోనా టైంలో ఆయుర్వేదిక్ చికెన్ బిర్యానీ.. ధ‌ర ఎంతంటే?

గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్‌ ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు

హీరో సుధాక‌ర్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్‌కి ఫిదా అయిన మెగాస్టార్