పరుగు తగ్గించిన పుత్తడి… పెళ్లిళ్ల సీజన్లో వినియోగదారులకు ఊరట… 10 గ్రాములకు రూ.48,500

ఇన్నాళ్లు ప్రజలకు అందకుండా పరుగుపెట్టిన పడిసి.. వారం రోజులుగా తన పరుగును తగ్గించింది. వరుసగా 5వ రోజు బంగారం ధర తగ్గింది.

  • Umakanth Rao
  • Publish Date - 5:23 pm, Fri, 27 November 20
పరుగు తగ్గించిన పుత్తడి... పెళ్లిళ్ల సీజన్లో వినియోగదారులకు ఊరట... 10 గ్రాములకు రూ.48,500

ఇన్నాళ్లు ప్రజలకు అందకుండా పరుగుపెట్టిన పడిసి.. వారం రోజులుగా తన పరుగును తగ్గించింది. వరుసగా 5వ రోజు బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,750 నుంచి రూ.1,900 తగ్గి, 48,750వద్దకు చేరింది. మొత్తానికి బంగారం ధర పెరుగుదలకు ఆగింది. ఆగస్టులో బంగారం ధర అత్యధికంగా రూ. 56,200 కు పెరిగింది. కాగా రెండు నెలల వ్యవధిలో బంగారం ధర దాదాపు రూ.7,000 వరకూ తగ్గింది.

పెరిగిన వెండి ధర…

వెండి ధరలు మాత్రం పెరిగింది. కిలో వెండి రూ.59,485 ఉండగా నవంబర్ 27న ధర కిలోకు రూ.28 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం వెండి క్రయ విక్రయాలు రూ.59,513గా మార్కెట్లో ఉంది. ఎంసీఎక్స్ లో కూడా 0.11శాతం వీటి ధర పెరిగింది. సాధారణంగా మార్కెట్లో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్న సమయంలో బంగారంపై పెట్టుబడులకే అత్యధికులు మొగ్గుచూపుతారు.

పెట్టుబడులు పెరుగుతున్నాయి…

బులియన్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురవుతుండటంతో వాటి ప్రభావం, బంగారం, వెండిపై పడుతోంది. 6 నెలలపాటు జోరందుకున్న వీటి ధరలు గత నెల రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇలా ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగే అవకాశాలున్నట్టు మార్కెట్లో అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

రానున్న రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు బంగారంపై పెట్టుబడులు గత కొంతకాలం భారీగా పెరుగుతున్నాయి. నిజానికి బంగారు ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగేందుకు ప్రధాన కారణం ఈటీఎఫ్ ల సేల్స్ పుంజుకోవటమే. అయితే ధరల పెరుగుదలలు ఎలా ఉన్నా దేశీయంగా బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతూనే ఉన్నాయి.