మరింత తగ్గిన బంగారం ధర…

దేశంలో బంగారం భగభగలకు బ్రేకులు పడుతున్నాయి. వరుసగా మూడో రోజూ బంగారం, వెండి ధరలు త‌గ్గుముఖం ప‌ట్టాయి

మరింత తగ్గిన బంగారం ధర...
Follow us

|

Updated on: Sep 23, 2020 | 6:59 PM

దేశంలో బంగారం భగభగలకు బ్రేకులు పడుతున్నాయి. వరుసగా మూడో రోజూ బంగారం, వెండి ధరలు త‌గ్గుముఖం ప‌ట్టాయి. లాక్‌డౌన్ స‌మ‌యంలో భారీగా రెక్కలొచ్చి సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకింది. ఒకానొక ద‌శ‌లో రూ.56 వేల‌కు చేరుకున్న బంగారం ధ‌ర‌లు ఇప్పుడిప్పుడే కాస్త క్ర‌మంగా త‌గ్గుకుంటు వస్తున్నాయి. బుధ‌వారం నాటి ట్రేడ్‌లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం రూ.614 త‌గ్గి రూ.50,750కి చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌డంతో దేశీయంగా కూడా ప‌సిడి ధ‌ర‌లు దిగి వ‌చ్చాయ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేష‌కులు వెల్ల‌డించారు. కాగా, గత ట్రేడింగ్ స్వల్ప మార్పులతో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.51,364 వ‌ద్ద ముగిసింది. వెండి ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గాయి. బుధ‌వారం నాటి ట్రేడింగ్ లో కిలో వెండి ధ‌ర రూ.1,898 త‌గ్గి రూ.59,720కు దిగివచ్చింది. గ‌త ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.61,618 వ‌ద్ద ముగిసింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్‌ ప‌సిడి ధ‌ర $1874 డాలర్లు ఉండగా, ఔన్స్ వెండి ధ‌ర‌ $23.26 డాలర్లు ప‌లికింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..