వామ్మో.. అరలక్ష‌కి చేరువగా.. బంగారం..!

Gold and silver rates hit New Record, వామ్మో.. అరలక్ష‌కి చేరువగా.. బంగారం..!

బంగారం ధరలకు రెక్కలొచ్చాయో.. ఏమో తెలీదు కానీ.. కొద్ది రోజులుగా.. పసిడి ధరలు మిన్నంటుతున్నాయి. 30 వేల రూపాయల నుంచి.. ఇప్పుడు 41 వేలకి చేరాయి. మొదటి నుంచీ.. కాస్త అటూ.. ఇటూగా.. పెరుగుతూ ఉన్నా.. కేంద్ర బడ్జెట్ ప్రేవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరీ పెరుగుతూ.. బంగారం ప్రియులకు షాకిస్తున్నాయి. ఇప్పుడు ఆల్‌టైమ్ హై రేటు పెరిగి.. కొండమీదకెక్కి కూర్చుంది బంగారం.

రూపాయి విలువ భారీగా పతనం కావడం కూడా.. బంగారం ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యూఎస్-చైనా ట్రేడ్ వార్ ఫలితంగా ఇప్పటికే బంగారం ధరలు 20 శాతం పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41 వేయిగా ఉండగా.. 22 క్యారెట్స్ బంగారు ఆభరణాల ధర రూ.38 వేలుగా ఉంది. ఇక అన్ని రాష్ట్రాల్లానూ.. బంగారం ధరలు 40 వేలకు పైగానే ఉన్నాయి. దీని పరంగా చూస్తుంటే.. భవిష్యత్తులో పసిడి ధరలు అరలక్షకు చేరువైనా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఆషాఢ మాసంలోనే.. బంగారం ధరలు తగ్గాల్సినా.. రూపాయి పతనంతో.. అది పెరుగుతూ.. వచ్చి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. బంగారంతో పాటు.. వెండి కూడా హైగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.48 వేలుగా ఉంది.

ఈ రకంగా చూస్తే.. మధ్యతరగతి ప్రజలకు బంగారం.. ఆమడదూరంగానే ఉండబోతుందా..? ఇక మరలా.. బంగారం ధరలు తగ్గవా..! అంటే.. పడిసి దుకాణాదారులు మాత్రం ఇకపై మరింత పెరుగుతాయే తప్ప.. తగ్గే ఛాన్స్ లేదని అంటున్నారు.

Gold and silver rates hit New Record, వామ్మో.. అరలక్ష‌కి చేరువగా.. బంగారం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *