Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు . ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిర్మల్ , కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు ,ఖమ్మం జిల్లాలలో భారీవర్షాలు . తెలంగాణలో సాధారణం గా చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. మరోవైపు ఒరిస్సా నుండి కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి . - రాజారావు, హైదరాబాద్ వాతావరణ శాఖ.
  • మాస్క్ ధరించకపోతే జరిమానా. గతం లో ఉన్న జరిమానా ని పెంపు. కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించకపోతే జరిమానాను 200 నుండి రూ .500 కు పెంచిన గుజరాత్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ .
  • అమరావతి: వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం వైయస్‌.జగన్‌ . కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష. సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అని సమావేశంలో ప్రస్తావన.
  • హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ ప్రభుత్వానికి లేఖలు. సీఎం జగన్ తో పాటు, లేఖ సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి లేఖల హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని వినతి. హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపిన బాలకృష్ణ. కర్ణాటక రాజధాని బెంగళూరు కి దగ్గరగా ఉండటంతో పాటు అనువైన స్థలం కూడా ఎక్కువగా ఉందని తెలిపిన బాలకృష్ణ.
  • అమరావతి : మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కొడుకు సురేష్ మాజీ పీఎస్ మురళీమోహన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ విచారణ. బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు. ఇప్పటికే పరారీలో ఉన్న పితానీ కొడుకు వెంకట సురేష్ వెంకట సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ అధికారులు. బెయిల్ ఇవ్వొద్దని కోర్టు కోరిన ఏసీబీ అధికారులు.

పెళ్లిళ్ల సీజన్‌లో గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

Gold Rates Today, పెళ్లిళ్ల సీజన్‌లో గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

గత కొంతకాలంగా జెడ్ స్పీడుతో దూసుకెళ్తున్న బంగారం ధరలు..కాస్త అదుపులోకి వచ్చాయి. దీంతో పసిడిప్రియులు ఊపిరి పీల్చుకున్నారు.  దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు దిగిరావడానికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బంగారంపై పెట్టుబడులు కూడా బలహీనంగా ఉన్నాయి. దీంతో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర నేడు రూ.149 తగ్గడం విశేషం. అలాగే బంగారం ధరతో పాటే పలు చోట్ల వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పెళ్లిళ్ల సమయం కావడంతో ముందుగా ఆర్డర్ ఇవ్వడానికి కూడా ఇదే సరైన సమయమని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

 

ఢిల్లీలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర: రూ.38,875

కిలో వెండి ధర : రూ.45,375

……………………………….

హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర: రూ.38, 790

హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర:  రూ.48,650

Related Tags