పసిడి పరుగు.. బంగారం ధర ఎంత పెరిగిదంటే…!

విజయ దశమి వరకు పడుతూ.. లేస్తూ వచ్చిన బంగారం ... దీపావళి దగ్గరపడుతుండటంతో మరోసారి పరుగు మొదలు పెట్టింది. రన్ రాజా రన్ అంటూ వేగం పెంచింది. రెండు రోజులపాటు తగ్గిన బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగింది.

పసిడి పరుగు.. బంగారం ధర ఎంత పెరిగిదంటే...!
Follow us

|

Updated on: Oct 30, 2020 | 4:05 PM

Gold Prices : విజయ దశమి వరకు పడుతూ.. లేస్తూ వచ్చిన బంగారం … దీపావళి దగ్గరపడుతుండటంతో మరోసారి పరుగు మొదలు పెట్టింది. రన్ రాజా రన్ అంటూ వేగం పెంచింది. రెండు రోజులపాటు తగ్గిన బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగింది.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్( MCX )లో ఈరోజు ప్రారంభ సెషన్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.150… అంటే 0.30 శాతం పెరిగి రూ.50,432 పలికింది. రూ.50,465 వద్ద ప్రారంభమై, రూ.50,525 వద్ద గరిష్టాన్ని, రూ.50,353 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.550కి పైగా తగ్గిన సంగతి తెలిసిందే. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,700కు పైగా తక్కువ ఉన్నది. నవంబర్ నెలలో యెల్లో మెటల్ మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కరోనా ప్రభావం బంగారం అమ్మకందారులపై ఉన్నప్పటికీ… వరుస పండుగలు… శుభకార్యాలు మొదలు కావడంతో గోల్డ్‌కు భారీ డిమాండ్ వచ్చినట్లే కనబడుతోంది.