భారీగా తగ్గిన పుత్తడి ధర

Gold prices drop by Rs 300 silver tumbles, భారీగా తగ్గిన పుత్తడి ధర

అంతకంతకూ పెరిగిన పుత్తడి ధర ఒక్కసారిగా కిందికి దిగొచ్చింది. రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర క్రమంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. ఈ ధరలు దేశరాజధాని ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.39,225గా నమోదైంది. గతవారం రూ. 39.885 లతో అమ్మకాలు జరిగాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర న్యూయార్క్ మార్కెట్‌లో 1509 డాలర్లకు పడిపోయింది. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.39,730 గా నమోదైంది. దేశ ఆర్దిక రాజధాని ముంబైలో రూ.39,720గాను, విజయవాడ, వైజాగ్ మార్కెట్‌లో రూ.39,760 గా అమ్మకాలు జరుగుతున్నాయి.
మరోవైపు వెండికి సైతం భారీగా ధర తగ్గింది. కేజీ వెండి రూ.1,400 తగ్గి రూ. 48,500 పలుకుతోంది. దేశీయంగా వెండి కొనుగోళ్లను పెంచేందుకు పెద్ద ఎత్తున ఆఫర్లు, డిస్సౌంట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో స్వల్ప తగ్గుదల ఉందన్ని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా బంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులు మాత్రం ఖుషీ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *