Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

భగభగ బంగారం ధరలు.. పెళ్లిళ్లు చేసుకుంటున్నవారికి షాకింగ్ న్యూస్!

ఈ ఏడాది రెండు నెలలు గడవకముందే దాదాపు రూ.3 వేలకు పైగా బంగారం ధరలు పెరిగాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ సంవత్సరాంతం మరీ భయంకరంగా ధరలు పెరుగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి..
Gold Price: Shocking News For Those Getting Married, భగభగ బంగారం ధరలు.. పెళ్లిళ్లు చేసుకుంటున్నవారికి షాకింగ్ న్యూస్!

Increasing Gold Price: ప్రస్తుతం బంగారం ధరలు భగభగ మండుతున్నాయి. మరీ కొండమీదకెక్కి కూర్చొంటున్నాయి. అందులోనూ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. పసిడిని కొనాలంటేనే భయ పడిపోతున్నారు వినియోగదారులు. రోజురోజుకీ పెరిగి షాక్‌ని ఇస్తున్నాయి. కొద్ది తేడాతో అరలక్షకి చేరువగా చేరుకుంటోంది. తాజాగా ఈ ఏడాది రెండు నెలలు గడవకముందే దాదాపు రూ.3 వేలకు పైగా బంగారం ధరలు పెరిగాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. ఈ సంవత్సరాంతం మరీ భయంకరంగా ధరలు పెరుగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

వచ్చే వారం లేదా వచ్చే నెలలో తగ్గుతుంది కదా అని ఆశగా ఎదురు చూస్తోన్న పసిడి ప్రియులకు నిరాశే మిగులుతోంది. అంతకంతకూ పసిడి ధరలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గే పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌తోనే.. మనదేశంలో బంగారం దిగుమతి సగానికి సగం తగ్గిపోయిందట. ఈ ఏడాది పెళ్లిళ్ల ముహుర్తాలు ముమ్మరంగా ఉన్నా కూడా.. ఎవరూ ఎక్కువగా బంగారాన్ని కొనడం లేదు. అక్కడక్కడా తప్పితే.. మిగతావారందరూ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

అయితే.. గోల్డ్ ధరలు రికార్డు స్థాయికి పెరగడమే దీనికి కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆకాశానికి అంటిన ధరలతో.. కొనుగోలు దారులు ముందుకు రావడం లేదంటున్నారు. గత రెండు నెలలుగా బంగారం రూ.43 వేలు దాటింది. తాజాగా ఈ రోజు హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.43,165గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 39,081గా ఉంది. నిన్నటికీ ఇవాళ్టీకీ.. దాదాపు వెయ్యి రూపాయల వరకూ పెరిగింది.

Gold Price: Shocking News For Those Getting Married, భగభగ బంగారం ధరలు.. పెళ్లిళ్లు చేసుకుంటున్నవారికి షాకింగ్ న్యూస్!

Related Tags