Breaking News
  • భారత్ దేశంలో 6 లక్షలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు. జూన్ నెలలో 4 లక్షల కేసులు,12 వేలకు పైగా మరణాలు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు,18 వేలకు చేరువలో మరణాలు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 19,148 కేసులు, 434మంది మృతి. దేశవ్యాప్తంగా 6,04,641 కేసులు,17,834 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టీవ్ కేసులు, 3,59,860 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ: కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు అదృశ్యం. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడంటున్న కుటుంబ సభ్యులు.
  • అమరావతి: హైకోర్టు ను ఆశ్రయించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. తనని హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం. రేపు విచారించనున్న న్యాయస్థానం.
  • యూపీ ఢిల్లీ హర్యానా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కరోనా మహమ్మారిపై సమీక్ష.
  • మేడ్చల్ జిల్లాల ఇస్మాయిల్ ఖాన్ గూడా లో దారుణం. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో అధ్య అనే ఆరేళ్ళ బాలికను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన కరుణాకర్ అనే వ్యక్తి.
  • గుంటూరు జిల్లా: నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ముప్పాళ్ల si జగదీష్ మోసం చేశాడని మహిళ పిర్యాదు. నాకు ఎలాంటి సంబంధం లేదన్న si జగదీష్. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సింధు. ఎస్సై జగదష్ తో పరిచయం. పెళ్ళి చేసుకుంటానని ఎస్సై మోసం చేశాడని ఆరోపిస్తున్న సింధు. సింధు ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు.
  • అమరావతి: రేపు ఢిల్లీకి వెళ్లనున్న వైసిపి ఎంపీలు. స్పీకర్ ను కలిసి రఘురామ కృష్ణంరాజు పై అనర్హత పిటిషన్ ఇచ్చే అవకాశం . రఘురామ కృష్ణంరాజు పై సీరియస్ గా వ్యవహరించాలని నిర్ణయించిన వైసిపి.

ఫ్లాష్ న్యూస్.. రూ.45 వేలు దాటిన గోల్డ్

బంగారం ధర రికార్డు బద్దలు కొట్టింది. ఒకేసారి ఆల్‌టైం హై రేటుకు చేరుకుంది. ఒకేసారి రూ.45 వేలకి చేరుకుంది. దీంతో.. పసిడి ప్రియులు బిత్తర..
Gold Price Reached Rs.45 Thousand, ఫ్లాష్ న్యూస్.. రూ.45 వేలు దాటిన గోల్డ్

బంగారం ధర రికార్డు బద్దలు కొట్టింది. ఒకేసారి ఆల్‌టైం హై రేటుకు చేరుకుంది. దీంతో.. పసిడి ప్రియులు బిత్తరపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది నిజంగా వారికి షాకింగ్ కలిగించిన న్యూస్ అనే చెప్పాలి. రెండు నెలల్లోనే 5 వేలు పెరిగి రికార్డు క్రియేట్ చేసింది బంగారం. ఈ ఏడాది ప్రారంభంలో రూ.40 వేల ప్రారంభమైన గోల్డ్.. రెండు నెలలు ముగిసేసరికి రూ.5 వేలు పెరిగింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌తో బంగారం కొనాలనుకేవారికి గట్టి షాకే తగిలింది.

అందులోనూ ఇప్పుడు పెళ్లిళ్ల ముహుర్తాలు ముమ్మరంగా ఉన్నాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇది నిజంగా పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూసే. దీన్ని బట్టి చూస్తే.. మరికొద్ది రోజుల్లోనే.. అరలక్షకి బంగారం ధరలు చేరుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కాగా ప్రస్తుతం.. హైదరాబాద్ మార్కెట్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,920లు కాగా, 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర రూ.41,000లుగా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.43,050లు కాగా, 22 క్యారెట్ల పసిడి ఆభరణాల ధర రూ.41,850గా ఉంది. ఇక ముంబాయిలో కూడా గోల్డ్ రేట్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల బంగారు ధర రూ. 43,510 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.42,000గా ఉంది.

Related Tags