బంగారునాణేలు ఆశచూపి..

చిత్తూరు జిల్లాలో ఘారానా దొంగతనం వెలుగుచూసింది. తక్కువ ధరకే బంగారు నాణేలు విక్రయిస్తామని ఆశ చూపి డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను బైరెడ్డిపల్లె పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..  సత్యవేడు మండలం మాదనపాళ్యం గ్రామానికి చెందిన జి.సుబ్రమణ్యం ఆరోగ్యం భాగా లేక వైద్య చికిత్సల కోసం బైరెడ్డిపల్లె మండలం విరుపాక్షిపురం గ్రామానికి వచ్చాడు. అక్కడ తమిళనాడు రాష్ట్రం బాగళూరు గ్రామానికి చెందిన మునివెంకటప్ప అనే వ్యక్తి సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పరుచుకొని తెలిసిన […]

బంగారునాణేలు ఆశచూపి..
Follow us

|

Updated on: Dec 26, 2019 | 6:26 PM

చిత్తూరు జిల్లాలో ఘారానా దొంగతనం వెలుగుచూసింది. తక్కువ ధరకే బంగారు నాణేలు విక్రయిస్తామని ఆశ చూపి డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను బైరెడ్డిపల్లె పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..  సత్యవేడు మండలం మాదనపాళ్యం గ్రామానికి చెందిన జి.సుబ్రమణ్యం ఆరోగ్యం భాగా లేక వైద్య చికిత్సల కోసం బైరెడ్డిపల్లె మండలం విరుపాక్షిపురం గ్రామానికి వచ్చాడు. అక్కడ తమిళనాడు రాష్ట్రం బాగళూరు గ్రామానికి చెందిన మునివెంకటప్ప అనే వ్యక్తి సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పరుచుకొని తెలిసిన వారి వద్ద బంగారు నాణేలు ఉన్నాయని, తక్కువ ధరకు కొని వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుందామని చెప్పి నమ్మించాడు. దీనికిగాను తన వాటాగా రూ.5లక్షలు ఇవ్వాలని చెప్పడంతో ఒప్పుకున్న అతను మూడుసార్లుగా మొత్తం రూ.5 లక్షలు ఇచ్చాడు. ఈ నెల 19వ తేదీన నాణేలు ఇస్తానని పిలిపించి నాణేలు ఇస్తున్న సమయంలో మునివెంకటప్పకు సంబంధించిన వ్యక్తులు పోలీసుల్లాగా రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికి ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌ అని రావడంతో సుబ్రహ్మణ్యం బైరెడ్డిపల్లె పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టగా…బైరెడ్డిపల్లె మండలం పెద్ద చెల్లారుగుంట వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 2.5 కిలోల బరువు ఉన్న ఒక ఇత్తడి చెంబు, మూడు మోటారు సైకిళ్లు, రూ.4లక్షల నగదుతో పాటు 900 గ్రాముల నకిలీ బంగారం, రెండు అసలైన బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. మునివెంకటప్పతో పాటు కర్ణాటక రాష్ట్రం బిక్కనపల్లె గ్రామానికి చెందిన నారాయణప్ప, చిన్నప్పయ్య, రౌఫ్‌సాబ్‌ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. మంజు అనే మరోవ్యక్తి పరారీలో ఉన్నాడని అతని కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నారని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.