తగ్గిన బంగారం ధర..

బంగారం పరుగులకు మరోసారి బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం యెల్లో మెటల్ ధరలు దిగివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై

తగ్గిన బంగారం ధర..
Follow us

|

Updated on: Oct 05, 2020 | 9:06 PM

Gold and Silver Prices : బంగారం పరుగులకు మరోసారి బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం యెల్లో మెటల్ ధరలు దిగివచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై స్ప్షష్టత కోసం ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో వ్యవహరించడంతో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారంలో తాజా కొనుగోళ్లు మందగించడంతో ధరలు దిగివచ్చాయి.

ఎంసీఎక్స్ (MCX)‌లో సోమవారం పదిగ్రాముల బంగారం 140 రూపాయలు దిగివచ్చి 50,430 రూపాయలు పలికింది. కిలో వెండి 33 రూపాయలు తగ్గి 61,112 రూపాయలుగా నమోదైంది. అయితే హైదరాబాద్, విజయవాడల్లో 10 గ్రాముల బంగారం రూ.52,045 ఉంది.

అమెరికా డాలర్‌ ఒడిదుడుకులకు లోనవడం, తాజా ఆర్థిక ఉద్దీపన చర్యలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు పెరగడం వంటి అంశాలతో పసిడి ధరల్లో అనిశ్చితి నెలకొందని జియోజిత్‌ కమోడిటీ హెడ్‌ హరీష్‌ వీ పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం 1900 డాలర్లకు తగ్గింది.