అరె! పానీ పూరీ ఏటీఎం ! ఇది లోకల్ ‘మంత్రం !

అమెరికాలో కప్ కేక్ వెండింగ్ మెషిన్లు ఉంటాయి. వాటి నుంచి కప్ కేకులు మాత్రమే వస్తాయి. అయితే మన దేశంలో దాన్ని తలదన్నినట్టు.. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన 'పానీ పూరీ' ఏటీఎంలను కనిపెట్టారు. ఎవరు దీన్ని సృష్టించారో గానీ..

అరె! పానీ పూరీ ఏటీఎం ! ఇది లోకల్ 'మంత్రం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2020 | 4:40 PM

అమెరికాలో కప్ కేక్ వెండింగ్ మెషిన్లు ఉంటాయి. వాటి నుంచి కప్ కేకులు మాత్రమే వస్తాయి. అయితే మన దేశంలో దాన్ని తలదన్నినట్టు.. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన ‘పానీ పూరీ’ ఏటీఎంలను కనిపెట్టారు. ఎవరు దీన్ని సృష్టించారో గానీ.. ఇందులో గోల్ గప్పా, పుచ్ కా, బటాషా ఇలా రకరకాల పేర్లతో పిలిచే పానీ పూరీలు ఇందులోనుంచి వచ్ఛేస్తాయి. కేవలం 20 రూపాయల నోటు ఇందులో వేస్తే చాలు.. 14 గప్ చుప్ లు వస్తాయట. హర్దీ సింగ్ అనే పోలీసు అధికారి ఈ గమ్మత్తయిన ‘ఏటీఎం’ తాలూకు వీడియోను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇంటర్నెట్ లో ఈ వీడియో ‘హల్చల్’ చేస్తోంది. ఈ విచిత్రమైన మెషిన్ తయారీకి ఆరు నెలలు పట్టిందట.