సోదరుల బాటలోనే గంగరాజు.. అందుకేనా జెండాల తొలగింపు?

బీజేపీలో కొనసాగాలనుకుంటున్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబంలో ఒంటరిగా మారారా? లేక తమ్ముళ్ళ బాటలోనే వెళుతున్నారా? శనివారం ఉదయం సంభవించిన పరిణామాలు చూసిన ఆయన అనుచరులు, వారి కుటుంబ సహచరులు ఈ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో చిరకాలంగా కొనసాగుతున్న గోకరాజు గంగరాజు.. కుటుంబం మొత్తం ఆయన బాటలోనే భారతీయ జనతాపార్టీలో కొనసాగింది. రోజులన్నీ ఒకేలా వుండవన్నట్లుగా.. తాజా పరిణామాల్లో గోకరాజు గంగరాజు ఫ్యామిలీ మొత్తం బిజెపి నుంచి వైసీపీకి మారిపోయింది. ఒక్క గంగరాజు ఒక్కరే […]

సోదరుల బాటలోనే గంగరాజు.. అందుకేనా జెండాల తొలగింపు?
Follow us

|

Updated on: Dec 14, 2019 | 2:05 PM

బీజేపీలో కొనసాగాలనుకుంటున్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబంలో ఒంటరిగా మారారా? లేక తమ్ముళ్ళ బాటలోనే వెళుతున్నారా? శనివారం ఉదయం సంభవించిన పరిణామాలు చూసిన ఆయన అనుచరులు, వారి కుటుంబ సహచరులు ఈ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో చిరకాలంగా కొనసాగుతున్న గోకరాజు గంగరాజు.. కుటుంబం మొత్తం ఆయన బాటలోనే భారతీయ జనతాపార్టీలో కొనసాగింది. రోజులన్నీ ఒకేలా వుండవన్నట్లుగా.. తాజా పరిణామాల్లో గోకరాజు గంగరాజు ఫ్యామిలీ మొత్తం బిజెపి నుంచి వైసీపీకి మారిపోయింది. ఒక్క గంగరాజు ఒక్కరే బిజెపిలో వుండిపోయారు. సరే.. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో కొనసాగడం తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదని అందరు సరిపెట్టుకున్నారు. కానీ ఆ మర్నాడే అసలు కథ మొదలైంది.

బీజేపీతో ఉన్న అనుబంధం కారణంగా ఆపార్టీలోనే వుండిపోవాలని గంగరాజు అనుకుంటే మిగిలిన వారు అంటే గంగరాజు సోదరులిద్దరు, ఆయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీని ప్రభావం గంగరాజు ఇంటిపైనా పడింది. శనివారం ఉదయాన్నే గోకరాజు గంగరాజు ఇంటివైపు చూసిన ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. ఇంటిపైనా, చుట్టు పక్కల వుండాల్సిన బీజేపీ జెండాలు రాత్రికి రాత్రే మాయమయ్యాయి. కుటుంబంలో అందరూ వైసీపీలో చేరడంతో బీజేపీ జెండాలను తొలగించేశారు.

అయితే, ఇంటి పెద్ద బీజేపీలోనే వున్నా కూడా బీజేపీ జెండాలను ఒక్కటీ వుంచకపోవడం చర్చనీయాంశమైంది. దాంతో గంగరాజు కూడా త్వరలో వైసీపీలోకి మారిపోవడం కన్‌ఫర్మ్ అని, దానికి సంకేతంగానే ఇంటి మీద మొత్తం జెండాలను తొలగించి, వైసీపీవి ఏర్పాటు చేసుకుంటున్నారని అనుకుంటున్నారు.