గోదావరి ఉగ్రరూపం… లంక గ్రామాలు ముంపు!

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజమండ్రి అర్బన్ పరిధిలో ఉన్న రెండు లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో పడవల్లో పునరావాస కేంద్రాలకు తలిస్తున్నారు. స్థాయికి మించి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఎటువంటి ప్రమాదం సంభవించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, పోచమ్మగండి, పోడిపల్లి, తొయ్యారు, పోలవరం మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ధవళేశ్వరం […]

గోదావరి ఉగ్రరూపం... లంక గ్రామాలు ముంపు!
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 7:41 PM

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజమండ్రి అర్బన్ పరిధిలో ఉన్న రెండు లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో పడవల్లో పునరావాస కేంద్రాలకు తలిస్తున్నారు. స్థాయికి మించి గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఎటువంటి ప్రమాదం సంభవించకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం, పోచమ్మగండి, పోడిపల్లి, తొయ్యారు, పోలవరం మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీకి ప్రస్తుతం 9.34 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 9.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.  వశిష్ఠ, వైనతేయ, గౌతమి పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో 26కు పైగా ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. పి.గన్నవరం మండలం చాలకలి పాలెం సమీపంలో కాజ్‌వే నీట మునిగింది. నాలుగు రోజులుగా కరకాయ లంక ప్రజలు అవస్థలు పడుతున్నారు. బూరుగు లంక, హరిగెలవారిపేట, జి.పెదపూడి లంక, అయోధ్య లంక, అనగారిలంక వాసులు మరబోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు. గండిపోచమ్మ అమ్మవారి విగ్రహం వద్ద 2 అడుగుల మేర వరద నీరు నిలిచింది. దీంతో హుండీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా ప్రాంతాల్లో అరటితోటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం, తొయ్యారు రహదారిపై 4 అడుగుల మేర ప్రవాహ ఉద్ధృతి నెలకొంది.
మరోవైపు వరద బాధితులకు అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతున్న పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత గ్రామాల్లో నిత్యావసర సామాగ్రిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, కేజీ వంటనూనె, కిలోఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఇతర వరద ప్రభావిత గ్రామాలను గుర్తించి బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్