గోదావరి టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు కమిటీ

గోదావరి బేసిన్లో టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు కమిటీ వేయాలని గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు నిర్ణయించింది. గోదావరి బోర్డు సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని బోర్డు ఛైర్మన్ .

గోదావరి టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు కమిటీ
Follow us

|

Updated on: Jun 05, 2020 | 9:46 PM

గోదావరి బేసిన్లో టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు కమిటీ వేయాలని గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు నిర్ణయించింది. గోదావరి బోర్డు సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని బోర్డు ఛైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ తెలిపారు. గోదావరి నదిపై వారు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌ఎస్‌ను అంచనా వేయడానికి, క్లియరెన్స్, అనుమతి పొందిన తరువాత తెలంగాణ రాష్ట్రం అంగీకరించిందని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఎజెండా అంశాలను వెంటనే జల్ శక్తి మంత్రిత్వ శాఖకు అందించాలని రెండు రాష్ట్రాలను అభ్యర్థించారు. పెద్దావాగు ప్రాజెక్టు ఆధునీకరణ ప్రతిపాదనకు సంబంధించిన సమస్యలను పరస్పరం పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు. అన్ని అంతర్- రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద తగిన సైట్లు, సాధనాలను గుర్తించడానికి సభ్యుడు, జీఆర్ఎంబీ కింద ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సీడబ్ల్యూసీ, హైదరాబాద్, పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్, రాష్ట్రాల నుంచి సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు.