బోటు జాడ తెలిసింది.. మరి యజమాని ఎక్కడ..?

Godavari Boat Mishap Latest Updates, బోటు జాడ తెలిసింది.. మరి యజమాని ఎక్కడ..?

గోదావరి బోటు ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతోంది. ఇప్పటికి మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విహారయాత్రకు వెళ్లి విషాదంలో చిక్కుకుపోయిన తమ వారి జాడ తెలియక కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. రోజుల గడుస్తున్న కొద్దీ వారిలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. కనీసం చివరి చూపుకు అయినా నోటుకోలేమా అంటూ ఆవేదన చెందుతున్నారు. అయితే 250 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు సోలార్ పరికరం ద్వారా గుర్తించినట్లు ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. బోటును వెలికితీసేందుకు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికి మొత్తం 34 మృతదేహాలను వెలికితీసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు.

ఇక బోటు యజమాని ఆచూకీ ఇంకా తెలియలేదు. 47 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వెంకటరమణను పట్టుకునేది ఎప్పుడు..? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కాగా, వెంకటరమణ కోసం గాలిస్తున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *