కొక్కెం తెగింది.. బోటు రాలేదు.. ఆపరేషన్ వశిష్ఠలో రెండో రోజూ వృధా.. !!

పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండవ రోజు కూడా రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ ముగిసింది. కాని బోటు మాత్రం ఓడ్డుకు రాలేదు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల బోటును ఓడ్డుకు తీసే ప్రయత్నం ఆలస్యం అవుతోందని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. రేపు ఎలాగైనా బోటును వెలికితీస్తామని అంటోంది. మరోవైపు లంగర్‌కు తగిలింది బోటే అని స్థానికులు చెబుతున్నారు. అయితే నిన్న నదిలోకి వదిలిన 2 […]

కొక్కెం తెగింది.. బోటు రాలేదు.. ఆపరేషన్ వశిష్ఠలో రెండో రోజూ వృధా.. !!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 6:09 PM

పశ్చిమగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండవ రోజు కూడా రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ ముగిసింది. కాని బోటు మాత్రం ఓడ్డుకు రాలేదు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల బోటును ఓడ్డుకు తీసే ప్రయత్నం ఆలస్యం అవుతోందని ధర్మాడి సత్యం టీం చెబుతోంది. రేపు ఎలాగైనా బోటును వెలికితీస్తామని అంటోంది.

మరోవైపు లంగర్‌కు తగిలింది బోటే అని స్థానికులు చెబుతున్నారు. అయితే నిన్న నదిలోకి వదిలిన 2 వేల మీటర్ల ఐరన్ రోప్ తెగడంతో వెయ్యి మీటర్ల రోప్ నీట మునిగిపోయింది. ఇక మధ్యాహ్నం వేసిన లంగర్ బయటకు లాగే క్రమంలో ఐరన్ కొక్కెం ఊడిపోయింది. దీంతో మరోసారి లంగర్ వేసి.. రేపు బోటును వెలికితీస్తామని సత్యం టీం చెబుతోంది. కచ్చులూరు వద్ద నుంచి మీడియాను పంపించివేశారు. మరోవైపు అక్కడి పరిస్థితిని మంత్రి కన్నబాబు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్రాంతం అంతా దుర్వాసనతో నిండిపోయింది.