బోటును పైకి తీస్తారా..? ఆ ఐదు డౌట్స్‌ ఏంటి..?

Godavari boat accident: Is it possible to pull out the boat from 315 feet underwater?, బోటును పైకి తీస్తారా..? ఆ ఐదు డౌట్స్‌ ఏంటి..?

సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్‌ పెరుగుతోంది. పడవపైకి తేలుతుందా లేదా అన్న సంశయం ఎక్కువవుతోంది. ఆధునిక యంత్రాలను వాడుతున్నా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా.. 315 అడుగుల్లో కూరుకుపోవడం ఆశలను అడియాశలు చేస్తోంది. తేలే అవకాశాలను బేరీజు వేసుకుంటే చాలా తక్కువనే చూపిస్తోంది.

1. కచ్చులూరులో జరిగిన ప్రమాదాన్ని చూస్తే… సాధారణ పౌరులైనా.. నిపుణులయినా ఒకే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఓవైపు ఉధృతంగా గోదావరి ప్రవహిస్తుండగా.. మరోవైపు సుడుల మధ్య సహాయకార్యక్రమాలు ఎంత చేసినా అసాధ్యమనే అంటున్నారు.

2. ఆచూకీ లభ్యం కానీ వారు బోటులోపలే ఉన్నారన్నది చాలా మంది అభిప్రాయం. నాలుగైదు మృతదేహాలు బయటపడ్డా ఎక్కువగా అందులోనే ఇరుక్కుని ఉంటారని భావిస్తున్నారు. డ్రాగర్‌ వంటి ఆధునిక పరికరాలను వాడుతున్నా.. బురదమయంగా ఉన్న ప్రాంతం కావడంతో సిబ్బందికి కష్టతరవుతోంది.

3. ఒకవేళ బోటును 315 అడుగుల లోతులో గుర్తించినా.. బయటకు తీసుకురావడం ఎలా అన్నది కూడా ఆలోచించాలి. ఒకవేళ బెలూన్‌ టెక్నాలజీని బెలిమెల సమయంలో వాడినట్టుగా ఇక్కడ వాడుదామని అనుకున్నా.. 40 టన్నుల వరకున్న బోటును తీయగలిగే.. సామర్ధ్యం ఉన్నవి ఉన్నాయా అన్నది కూడా డౌటే.

4. లేదంటే హుస్సేన్‌సాగర్‌లో బుద్దవిగ్రహం మునిగిన సమయంలో అండర్‌గ్రౌండ్‌లో ట్రాక్‌వేసి తీసినట్టుగా చేద్దామన్నా కుదరదనే అంటున్నారు. వాటర్‌ స్టాగ్నెట్‌గా ఉంటే సాధ్యం కావచ్చేమో. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రవాహం ఉన్నది కావడంతో అది కుదరదనే చెబుతున్నారు. చాలా లోతున్న కచ్చలూరులో మలుపు ఉండి.. బుదరమయంగా ఉంది. కనీసం బోటుపై వెళ్లి అక్కడ స్టేబుల్‌గా ఉండి చూడడానికి కూడా రెస్క్యూ సిబ్బందికి సాధ్యం కావడం లేదు.

5. చీకటి పడితే సహాయక చర్యలు సాగవు. విద్యుత్‌ ఏర్పాటుచేసుకుని కొనసాగిద్దామన్నా.. ఏ మాత్రం అవకాశం లేదు. చీకటి పడేలోపే సహాయక చర్యలను ముమ్మరం చేసుకోవాలి.. లేదంటే మళ్లీ రేపటి వాయిదా వేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *