బోటు వెలికితీత.. ఈసారైనా సక్సెస్ అవుతారా…?

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోల్తా పడ్డ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ధర్మాడి సత్యం బృందం ఆ మధ్యన దానిని బయటకు తీసేందుకు చాలా శ్రమించింది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతిని పెరగడంతో బోటు వెలికితీత ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ఇందుకోసం జిల్లా […]

బోటు వెలికితీత.. ఈసారైనా సక్సెస్ అవుతారా...?
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 5:28 PM

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోల్తా పడ్డ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ధర్మాడి సత్యం బృందం ఆ మధ్యన దానిని బయటకు తీసేందుకు చాలా శ్రమించింది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతిని పెరగడంతో బోటు వెలికితీత ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి బోటును వెలికి తీసేందుకు ధర్మాడి సత్యం బృందం సిద్ధమైంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ను కలిసి అనుమతి కోరిన బృందం.. సోమవారం తమ ప్రయత్నాలను ప్రారంభించనున్నట్లు జిల్లా అధికారులకు సమాచారం అందించింది.

కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద పర్యాటకులతో వెళ్తోన్న బోటు బోల్తా పడింది. ఆ సమయంలో 8 మంది సిబ్బంది.. ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 38 మృతదేహాలను బయటకు తీశారు. మరో 11 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్‌బాడీలు చిక్కుకొని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బోటును బయటికి తీసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బోటు లోతులో పడటం.. వాతావరణం సహకరించకపోవడంతో.. దానిని ఇప్పటివరకు వెలికి తీసుకురాలేకపోయారు. ఇక ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో ధర్మాడి సత్యం బృందం ఆదివారం కలెక్టర్‌ను కలిసి గోదావరి పరిస్థితి వివరించింది. ఈ నేపథ్యంలో మరోసారి బోటు వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి ఈ సారైనా వారి ప్రయత్నం సక్సెస్ అవుతుందేమో చూడాలి.