Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

Godavari Boat Accident: 315 లోతులో బోటు.. పైకి తీసుకురావడం కష్టమేనా..!

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 38 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు జోరుగా గాలిస్తున్నారు. రెండు హెలికాప్టర్లను రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడుతున్నారు. గల్లంతైన వారు నీటిలో కొట్టుకుపోయారా..? లేక బోటులోనే చిక్కుకుపోయారా..? అన్నది ఇంకా తెలియరాలేదు. తాజాగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచీ ఓ డెడ్ బాడీ కిందికి కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం దాటిన తరువాత గోదావరి రకరకాల పాయలుగా చీలిపోతుంది. నీటిలో కొట్టుకోని పోయి ఉంటే ఎవరు ఏ పాయ వైపు కొట్టుకుపోయారో తెలుసుకోవడం చాలా కష్టం.

ఇదిలా ఉంటే ప్రమాదంలో మునిగిపోయిన బోటు.. ఏకంగా 315 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చిన సైడ్ స్కాన్ సోనార్‌ బోటు జాడను కనిపెట్టింది. ఇక దాన్ని బయటకు తీయడమే మిగిలి ఉంది. అది చాలా కష్టమైన వ్యవహారంగా చెబుతున్నారు. అంత లోతులో ఉండటం వల్ల బయటకు తీసేలోపు అది ముక్కలైపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. చూడాలి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.