Godavari Boat Accident: పడవ ప్రమాదంపై హోంమంత్రి స్పందన!

దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. నదిలో పెద్ద రాయి తగలడం వల్లే లాంచీ బోల్తా పడినట్లు ఆమె అనుమానించారు. గోదావరి నదిలో వరద ఉద్దృతి ఎక్కువగానే ఉందన్నారు. లాంచీ అనుమతిపై పూర్తి వివరాలు తెలుసుకుంటామని.. పర్యటనకు అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తెలిపారు. సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత […]

Godavari Boat Accident: పడవ ప్రమాదంపై హోంమంత్రి స్పందన!
Follow us

|

Updated on: Sep 16, 2019 | 10:16 AM

దేవీపట్నం బోటు ప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. నదిలో పెద్ద రాయి తగలడం వల్లే లాంచీ బోల్తా పడినట్లు ఆమె అనుమానించారు. గోదావరి నదిలో వరద ఉద్దృతి ఎక్కువగానే ఉందన్నారు. లాంచీ అనుమతిపై పూర్తి వివరాలు తెలుసుకుంటామని.. పర్యటనకు అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి తెలిపారు. సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత తెలిపారు.

కాగా సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పాపికొండలు చూసేందుకు రాయల్ వశిష్ట బోటులో 62 ప్రయాణికులు వెళ్లినట్లు తెలుస్తోంది. కచ్చులూరు వద్ద పడవ బోల్తా పడింది. ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. 24 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. మిగతా వారి కోసం గాలింపులు చర్యలు చేపడుతున్నారు. అటు ఈ ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.