Breaking News
  • అమరావతి: చంద్రబాబు నివాసంలో సీనియర్‌ నేతల అత్యవసర భేటీ. టీవీ9 బిగ్ డిబేట్‌లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై చర్చ. ముఖ్య నేతలు పార్టీ వీడతారనే ప్రచారంపై పార్టీలో కలకలం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు. రాష్ట్రపతి పాలనకు తెరపడే అవకాశం. శివసేన, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన సయోధ్య. శివసేనకు పూర్తికాలం సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకారం. కాంగ్రెస్‌, ఎన్సీపీకి డిప్యూటీ సీఎంతో పాటు 50 శాతం మంత్రి పదవులు. కాసేపట్లో సోనియా, పవార్‌ కీలక భేటీ.
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • అమరావతి: మంగళగిరిలోని చిల్లపల్లి కల్యాణమండపం చేరుకున్న పవన్‌. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి-పవన్‌ కల్యాణ్‌.
  • గుంటూరు: రొంపిచెర్ల (మం) రామిరెడ్డిపాలెం సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం. ఓ కేసులో ఊరు విడిచి వెళ్లిన సర్పంచ్‌ కోటిరెడ్డి. పోలీసులు అరెస్ట్‌ చేయడంతో పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం. నర్సరావుపేట ఆస్పత్రికి తరలింపు.
  • తిరుపతి: చంద్రగిరి లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు. 45 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్‌.
  • సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటన. ఆందోల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధికార్యక్రమాలు. సింగూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న హరీష్‌రావు. మంత్రి హరీష్‌రావుతో పాటు పాల్గొననున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌.

Godavari Boat Accident: ప్రాణాలు కాపాడిన లైఫ్ జాకెట్లు..!

All Survivors in Boat accident in AP, have a Life Jackets

ఒక్క బోటు ప్రమాదంతో.. అందరి జీవితాల్లో చీకటి నింపింది గోదారమ్మ. మొత్తం 63 మంది కలిసి హాయిగా బోటు ప్రమాదం చేసుకుంటున్న తరుణంలో.. ఈ ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి 46 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. పాపికొండలను చూసేందుకు పర్యాటకులు లాంచీలో వెళ్తుండగా ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది.

కాగా.. ఈ ప్రమాదంలో.. లైఫ్‌ జాకెట్లతో ఉన్న 11 మంది ప్రయాణికులు క్షేమంగా వచ్చినట్లు సమాచారం. ప్రయాణికుల్లో కొందరికే బోటు సిబ్బంది లైఫ్ జాకెట్లు ఇవ్వడంతో ఎక్కువ మంది గల్లంతయ్యేందుకు అవకాశం ఏర్పడింది. లైఫ్ జాకెట్లు ధరించినవారు దాదాపు ఒడ్డుకు రాగలిగారు. దర్శన సురేశ్, దశరథం, లక్ష్మీ, ప్రభాకర్ మరికొందరు.. లైఫ్‌ జాకెట్లను ధరించడం వల్ల బతికి బయటపడినట్లు.. పలువురు ప్రయాణికులు చెబుతున్నారు. కాగా.. చాలా మంది వీటి ధర ఎక్కువగా ఉంటుందని.. అనుకొని వాటిని ధరించరు.

లైఫ్ జాకెట్ల వల్ల ఉపయోగాలు:

1. నదీ విహారానికి వచ్చేవాళ్లు తప్పనసరిగా లైఫ్ జాకెట్లను ధరించాలి
2. లైఫ్ జాకెట్లు బరువు తక్కువగా ఉండటం వల్ల.. అవి నీటిలో తేలియాడుతాయి.
3. ఒక్కో లైఫ్ జాకెట్ రూ.1000 నుంచి రూ.3 వేలకు పైగానే ఉంటాయి.
4. మరికొన్ని రూ.100 నుంచి రూ.150లోపు కూడా లభ్యమవుతూంటాయి.
5. నీట మునిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఈ జాకెట్లు కాపాడగలవు.
6. తక్షణమే సాయం అందించే పరిస్థితి ఉన్న సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తారు.
7. అలాగే.. లైఫ్ జాకెట్స్ ఉన్న వాళ్లు వీటిని ధరించడం వల్ల.. నీటిలో కొట్టుకుపోకుండా.. ఒడ్డుకు ఈదుకుని రాగలరు.