కరువు జిల్లాను ఆదుకుంటున్న మేక పాలు..

మేక పాలు, గొర్రె పాలను తాగాలంటే చాలా మంది విముఖత చూపుతారు. ఎందుకంటే, వాటిలో అదో రకమైన వాసన వస్తుంది. పైగా అవి తొందరగా అరగవు అని కూడా అంటుంటారు. దీంతో వాటి పాల అమ్మకాలు గానీ, కొనుగోలు గానీ పెద్దగా పట్టించుకోరు. కానీ, అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా వాసులకు మాత్రం మేక పాలే జీవనాధారంగా మారాయి. ఇప్పుడు అక్కడి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటోంది ఓ రకం జాతి మేక పాలు. […]

కరువు జిల్లాను ఆదుకుంటున్న మేక పాలు..
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 3:18 PM

మేక పాలు, గొర్రె పాలను తాగాలంటే చాలా మంది విముఖత చూపుతారు. ఎందుకంటే, వాటిలో అదో రకమైన వాసన వస్తుంది. పైగా అవి తొందరగా అరగవు అని కూడా అంటుంటారు. దీంతో వాటి పాల అమ్మకాలు గానీ, కొనుగోలు గానీ పెద్దగా పట్టించుకోరు. కానీ, అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా వాసులకు మాత్రం మేక పాలే జీవనాధారంగా మారాయి. ఇప్పుడు అక్కడి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటోంది ఓ రకం జాతి మేక పాలు. ఉస్మానాబాద్‌ జిల్లా రైతులకు ఇప్పుడు ఉస్మానాబాదీ మేక ఆదాయ వనరుగా మారింది. ఈ ప్రాంతంలోని దాదాపు 250 కుటుంబాలు మేక పాలతోనే జీవనోపాధి పొందుతున్నారు. ఉస్మానాబాదీ మేక పాలతో వారు సబ్బులను తయారు చేస్తున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఈ జిల్లాలోని 25 గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు సబ్బుల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. విటమిన్‌ ఏ, ఈ, సెలీనియం, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ మేక పాలు..చర్మ వ్యాధులను నయం చేస్తాయని శివార్‌ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినాయక్‌ హెగనా తెలిపారు. ఒక లీటరు ఉస్మానాబాదీ మేక పాలకు తాము రూ. 300 చెల్లిస్తున్నట్లుగా తెలిపారు. ఇక సబ్బుల తయారీలో పనిచేస్తున్నందుకుగానూ, ప్రతిరోజు  రైతులు కూడా రూ. 150లు సంపాదిస్తారని ఆయన వివరించారు. 1400 మేకల ద్వారా కనీసం 250 కుటుంబాలు ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లుగా సంస్థ సీఈవో వెల్లడించారు.