రూట్ మ్యాప్ మరిచి.. అలానే వెళ్లిన విమానం.. చివరకు..

ఒక్కోసారి చిన్న చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని తీసుకోస్తుంది. కానీ అదృష్టం బాగుంటే అలాంటి ప్రమాదం నుంచి ఇట్టే బయటపడిపోతాం. శనివారం గో ఎయిర్ విమాన ప్రయాణికులకు అలాంటి ఓ వింత అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన రెండు గంటలకే మళ్లీ తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. అయితే తిరిగి రిటర్న్ రావడంతో అంతా ఆందోళన చెందారు. అయితే విషయం తెలుసుకున్న తర్వాత ముక్కన వేలేసుకున్నారంతా. 146 మంది ప్రయాణికులతో వెళ్తున్న […]

రూట్ మ్యాప్ మరిచి.. అలానే వెళ్లిన విమానం.. చివరకు..
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2019 | 1:23 AM

ఒక్కోసారి చిన్న చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని తీసుకోస్తుంది. కానీ అదృష్టం బాగుంటే అలాంటి ప్రమాదం నుంచి ఇట్టే బయటపడిపోతాం. శనివారం గో ఎయిర్ విమాన ప్రయాణికులకు అలాంటి ఓ వింత అనుభవం ఎదురైంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌ వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయిన రెండు గంటలకే మళ్లీ తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. అయితే తిరిగి రిటర్న్ రావడంతో అంతా ఆందోళన చెందారు. అయితే విషయం తెలుసుకున్న తర్వాత ముక్కన వేలేసుకున్నారంతా. 146 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమాన సిబ్బంది.. అసలు గమ్యస్థానానికి దారి చూపే నావిగేషన్‌ చార్టులనే మర్చిపోయారట. అయితే ఈ చార్టులు మర్చిపోడానికి కూడా ఓ కారణం ఉంది. బ్యాంకాక్‌ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చివరి నిమిషంలో విమానాన్ని మార్చారు. అయితే ఈ సమయంలో నావిగేషన్‌ చార్టులు అందులోనే వదిలేశారు. దీన్ని గమనించుకోకుండా విమానం బయల్దేరిపోయింది. కాసేపటి తర్వాత చార్టుల కోసం చూడగా…అది కనిపించలేదు. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి తెచ్చారు. ప్రయాణికుల క్షేమమే మాకు ముఖ్యమని.. నావిగేషన్‌ చార్టులు మర్చిపోవడంతో మా సిబ్బంది జీ8-037 విమానాన్ని వెనక్కి తెచ్చేశారని.. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని గో ఎయిర్ సంస్థ అధికారులు తెలిపారు.