గోవా టూరిస్టులకు షాకింగ్ న్యూస్.. రెండు నెలల 144 సెక్షన్..!

గోవా టూరిస్టులకు ఇంటలిజెన్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గోవాలోని వెస్టర్న్ ఘాట్ ప్రాంతంలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నార్త్ గోవా జిల్లా పరిధిలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు నార్త్ గోవా జిల్లా కలెక్టర్ ఆర్. మనేకా ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచే ఈ సెక్షన్ అమలైంది. ఇది 60 రోజుల పాటు.. అనగా ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ 144 […]

గోవా టూరిస్టులకు షాకింగ్ న్యూస్.. రెండు నెలల 144 సెక్షన్..!
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2020 | 4:54 AM

గోవా టూరిస్టులకు ఇంటలిజెన్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గోవాలోని వెస్టర్న్ ఘాట్ ప్రాంతంలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నార్త్ గోవా జిల్లా పరిధిలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు నార్త్ గోవా జిల్లా కలెక్టర్ ఆర్. మనేకా ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచే ఈ సెక్షన్ అమలైంది. ఇది 60 రోజుల పాటు.. అనగా ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ 144 సెక్షన్ అమలులో ఉండనున్నట్లు తెలిపారు. ఇంటలిజెన్స్ అందించిన పక్కా సమాచారం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ఇంటలిజెన్స్ తెలుపుతూ వస్తోంది. ఇక కొత్తగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని.. సరైన గుర్తింపు కార్డులు లేని వారికి గదులు కేటాయించొద్దని లాడ్జ్, హోటల్స్ , ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లకు కూడా ఆదేశాలు జారీచేశారు.