గోవాలో పెరుగుతున్న కరోనా కేసులు..!

గోవాలోని మాంగోర్ హిల్ ప్రాంతంలో గత 24 గంటల్లో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనైందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం: సీఎం ప్రమోద్ సావంత్.

గోవాలో పెరుగుతున్న కరోనా కేసులు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 03, 2020 | 6:50 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నా సమయంలో ప్రశాంతంగా ఉన్న గోవా రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల సంఖ్య గణనీయం పెరగుతోంది. గోవాలోని మాంగోర్ హిల్ ప్రాంతంలో గత 24 గంటల్లో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. కొత్తగా నమోదైన కేసులతో గోవాలో కరోనా పాజిటివ్ కేసుల 119కి చేరింది. వీటిలో 62 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 57 మందికి పూర్తిగా కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. మాంగోర్ హిల్ రీజియన్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రాంతంలోని వారందరికి వైద్య పరీక్షలు వేగవంతం చేశామన్నారు. మొత్తం 200 మందిని పరీక్షించగా 40 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన చెప్పారు. ఇక నిసర్గ సైక్లోన్ పై ఇప్పటికే అలర్ట్ ప్రకటించామని, సైక్లోన్ ప్రభావం తక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నామన్నారు సీఎం సావంత్. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖలను అప్రమత్తం చేశామన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనైందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సావంత్ చెప్పారు.