ఏపీ రాజధాని: జీఎన్ రావు కమిటీ కీలక సూచనలు..!

గత కొద్ది రోజులుగా.. జీఎన్ రావు కమిటీ.. కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కమిటీ బృందం తాజాగా చేసిన సూచనల్లో.. కర్నూలు ఎయిర్‌పోర్ట్ వద్ద భూములను సిద్ధం చేయాలన్నది ప్రధాన అంశంగా మారింది. దీనిపై కేవలం హైకోర్టు కోసమే భూములు సిద్ధం చేయమన్నారంటూ చర్చ జరుగుతోంది. దీంతో.. అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు.. శాశ్వత మంచినీటి సరఫరా సౌకర్యానికి ఏర్పాట్లు చేయాలని కూడా ఈ […]

ఏపీ రాజధాని: జీఎన్ రావు కమిటీ కీలక సూచనలు..!
Follow us

| Edited By:

Updated on: Nov 18, 2019 | 10:08 AM

గత కొద్ది రోజులుగా.. జీఎన్ రావు కమిటీ.. కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కమిటీ బృందం తాజాగా చేసిన సూచనల్లో.. కర్నూలు ఎయిర్‌పోర్ట్ వద్ద భూములను సిద్ధం చేయాలన్నది ప్రధాన అంశంగా మారింది. దీనిపై కేవలం హైకోర్టు కోసమే భూములు సిద్ధం చేయమన్నారంటూ చర్చ జరుగుతోంది. దీంతో.. అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు.. శాశ్వత మంచినీటి సరఫరా సౌకర్యానికి ఏర్పాట్లు చేయాలని కూడా ఈ కమిటీ సిఫారసు చేసింది.

చంద్రబాబు గతంలో.. ‘ఏపీ రాజధాని అమరావతి’యే అంటూ అభివృద్ధి పనులు చేపట్టినా.. అందుకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. అంతేకాకుండా.. తాజాగా.. కేంద్రం విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్ మ్యాప్‌లో కూడా.. అమరావతిని గుర్తించలేదు. దీంతో.. ఏపీ ప్రజల్లో కలవరం మొదలైంది. అటు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. 5 నెలలు పూర్తయినా.. రాజధానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. ఇప్పుడు జీఎన్ రావు కమిటీ.. చేసిన సూచనల నేపథ్యంలో ఖచ్చితంగా.. రాజధాని.. ఏది..? అనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగిపోతోంది.