కరోనాపై పోరులో కొత్త రకం చికిత్స…ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్

కరోనాపై పోరులో ఓ ఫార్మా సంస్థ కొత్త చికిత్సా విధానాన్నిఅందుబాటులోకి తెచ్చింది. సదరు సంస్థ ప్రతిపాదించిన కొత్త చికిత్సా విధానానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (ఐసీఎంఆర్) నుంచి అనుమతి లభించింది.

కరోనాపై పోరులో కొత్త రకం చికిత్స...ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: May 27, 2020 | 11:07 AM

కరోనాపై పోరులో ప్రపంచ దేశాలు నిరంతర యుద్ధం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలను హరింపజేస్తున్న వైరస్ మహమ్మారిని అంతమొందించే వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర కేంద్రంగా పనిచేసే ఓ ఫార్మా సంస్థ కొత్త చికిత్సా విధానాన్నిఅందుబాటులోకి తెచ్చింది. సదరు సంస్థ ప్రతిపాదించిన కొత్త చికిత్సా విధానానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (ఐసీఎంఆర్) నుంచి అనుమతి లభించింది. కరోనా రోగులకు ఈ విధానంలో చికిత్స తొలిదశలోనే చేస్తే మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో వైరస్ లక్షణాలు ప్రారంభమైనప్పుడే ఈ ఔషధం అధికంగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు.

కొత్త చికిత్స విధానం పూర్తి వివరాలు పరిశీలించగా… మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ కరోనా బాధితులకు అందించే చికిత్సలో కొత్త విధానాన్ని కనుగొంది. ఫావిపిరావిర్, యుమిఫెనోవిర్ అనే రెండు యాంటీవైరల్ మెడిసిన్లను కలిపి కరోనా కోసం కొత్త చికిత్సా విధానాన్ని రూపొందించాలని గ్లెన్‌మార్క్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా తేలికపాటి కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన 158 మందికి ఈ విధానంలో చికిత్స అందించనున్నట్లు సమాచారం. ఈ మేరకు గ్లెన్‌మార్క్ ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా మాట్లాడారు. వివిధ వైరస్‌లను సమర్థంగా నియంత్రించే యాంటీవైరల్ ఏజెంట్లను మిళితం చేసి రూపొందించే చికిత్సా విధానాలు ప్రభావవంతంగా ఉంటాయని చెప్పారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించి తొలిదశలో ఉన్నప్పుడే ఈ విధానం మెరుగ్గా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తే కరోనాను చాలావరకు నియంత్రించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.