నదిలో విహారానికి వెళ్లి నటి మిస్సింగ్…

కాలిఫోర్నియాలోని నదిలో విహారానికి వెళ్లిన నటి నయా రివెరా.. బుధవారం మధ్యాహ్నం నుంచి మిస్ అయ్యారు. రివెరా త‌న కుమారుడు జోసీని కూడా విహారానికి వెంట‌బెట్టుకెళ్లారు

నదిలో విహారానికి వెళ్లి  నటి మిస్సింగ్...
Follow us

|

Updated on: Jul 09, 2020 | 3:30 PM

కాలిఫోర్నియాలోని నదిలో విహారానికి వెళ్లిన నటి నయా రివెరా.. బుధవారం మధ్యాహ్నం నుంచి మిస్ అయ్యారు. రివెరా త‌న కుమారుడు జోసీని కూడా విహారానికి వెంట‌బెట్టుకెళ్లారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మయంలో ఓ బోటు అద్దెకు తీసుకుని రివెరా న‌దిలో విహారానికి వెళ్లిన‌ట్లు తెలుస్తుంది. ఆ త‌ర్వాత మూడు గంట‌ల‌కు లైఫ్ జాకెట్ వేసుకున్న ఆమె కుమారుడ్ని ఓ బోట‌ర్ ర‌క్షించాడు. ఆ పిల్లాడికి ఎటువంటి గాయాలు గాలేదు. ప్రస్తుతం న‌టి ఆచూకి కోసం హెలికాప్టర్లు, డ్రోన్లసాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు అధికారులు. హిట్ టీవీ మ్యూజికల్ డ్రామా “గ్లీ” లో సంతాన లోపెజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది న‌యా రెవెరా.

View this post on Instagram

just the two of us

A post shared by Naya Rivera (@nayarivera) on