‘ టర్మినేటర్ ‘ పై ఎటాక్.. వాట్ ఎ షాక్ ?

కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ షెవార్జ్ నెగ్గర్ పై దాడి జరిగింది. జోహాన్స్ బర్గ్ లో ఓ స్నాప్ చాట్ వీడియో రికార్డింగ్ కు హాజరైన ఆయనపై ఓ గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా వెనుకనుంచి వచ్చి దాడి చేశాడు. ఆయన తలపై చేత్తో బలంగా కొట్టడంతో ఆయన దాదాపు కింద పడిపోయాడు. అయితే వెంటనే ఆర్నాల్డ్ సెక్యూరిటీ గార్డులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేశారు. కాగా-ఈ ఘటనపై ఆర్నాల్డ్ పెద్దగా చలించలేదు. ఇది దురదృష్ట సంఘటన అని, ఓ మిస్చివస్ ఫ్యాన్ చేసిన పనికి నేనేమీ చింతించడం లేదని పేర్కొన్నాడు. కండల వీరుడిగా పాపులర్ అయిన ఆర్నాల్డ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఆఫ్రికాలో ‘ ఆర్నాల్డ్ క్లాసిక్ ఆఫ్రికా ‘ పేరిట ఆయన గౌరవార్థం మూడు రోజులపాటు జరిగే పోటీలకు సుమారు 24 వేలమంది అథ్లెట్లు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన స్నాప్ చాట్ వీడియో కార్యక్రమానికి ఈయన అటెండ్ అయినప్పుడు ఈ సంఘటనజరిగింది. అయితే ఆర్నాల్డ్ ఫ్యాన్స్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *