ఆ గురుద్వారాను కాపాడండి.. కేంద్రానికి సోనియా అభ్యర్థన

పాకిస్తాన్ లోని నన్ కన్నా సాహిబ్ గురుద్వారాను పరిరక్షించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని కోరారు. ప్రపంచం లోని పవిత్ర సిక్కు గురుద్వారాల్లో ఒకటైన ఈ మందిరాన్ని సంఘ వ్యతిరేక శక్తుల నుంచి కాపాడాలని, ఈ విషయమై పాకిస్తాన్ తో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ గురుద్వారాకు వచ్ఛే భక్తులను దుండగుల బారి నుంచి కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చించాలని కూడా ఆమె అన్నారు. కొంతమంది దుండగులు […]

ఆ గురుద్వారాను కాపాడండి.. కేంద్రానికి సోనియా అభ్యర్థన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 05, 2020 | 4:06 PM

పాకిస్తాన్ లోని నన్ కన్నా సాహిబ్ గురుద్వారాను పరిరక్షించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని కోరారు. ప్రపంచం లోని పవిత్ర సిక్కు గురుద్వారాల్లో ఒకటైన ఈ మందిరాన్ని సంఘ వ్యతిరేక శక్తుల నుంచి కాపాడాలని, ఈ విషయమై పాకిస్తాన్ తో సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ గురుద్వారాకు వచ్ఛే భక్తులను దుండగుల బారి నుంచి కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చించాలని కూడా ఆమె అన్నారు. కొంతమంది దుండగులు కేవలం రెచ్ఛగొట్టే ధోరణిలో దాడులకు పాల్పడుతున్నారని, ఇకనైనా ఈ విధమైన పవిత్ర మందిరాలపై దాడులు జరగకుండా చూడాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ విధమైన అరాచకాలకు అడ్డుకట్ట వేయలేమని ఆమె అభిప్రాయపడ్డారు. అటు-సోనియా కుమారుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ‘ సహనం లేమి ‘ అన్నది ప్రమాదకరమైనదని, ‘ పాతకాలపు ఛాందస విషమని ‘ ట్వీట్ చేశారు. కాగా-శిరోమణి అకాలీదళ్ నేతలు, కార్యకర్తలు ఢిల్లీ లోని పాక్ హైకమిషన్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా ఈ కార్యాలయం వద్దకు రాబోగా పోలీసులు అడ్డుకున్నారు.ఇటీవల గురుద్వారాపై కొంతమంది రాళ్లు విసిరి బీభత్సం సృష్టించడంతో ఈ మందిరంలోని భక్తులు తీవ్ర భయాందోళనలు చెందారు.