కశ్మీర్ సీఎంపై కేంద్ర మంత్రి ఆగ్రహం

న్యూఢిల్లీ: కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కపట నాటకాలు ఆడుతున్నారని, పాకిస్తాన్‌ను ప్రేమించడం మానుకోవాలని హెచ్చరించారు. ఆమె పాకిస్తాన్‌ను ప్రేమించడం మానుకోవాలి. ఆమెను భారతదేశం పోషిస్తోంది… ఆమె దేశం కోసం నిలబడాలి. అన్నం పెడుతున్న చేతిని ఆమె కాటువేయకూడదని గిరిరాజ్ అన్నారు. పుల్వామా దాడిపై ఇటీవల స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు ఓ అవకాశం ఇవ్వాలంటూ మెహబూబా పేర్కొన్న నేపథ్యంలోనే గిరిరాజ్ ఈ […]

కశ్మీర్ సీఎంపై కేంద్ర మంత్రి ఆగ్రహం
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 9:15 PM

న్యూఢిల్లీ: కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కపట నాటకాలు ఆడుతున్నారని, పాకిస్తాన్‌ను ప్రేమించడం మానుకోవాలని హెచ్చరించారు. ఆమె పాకిస్తాన్‌ను ప్రేమించడం మానుకోవాలి. ఆమెను భారతదేశం పోషిస్తోంది… ఆమె దేశం కోసం నిలబడాలి. అన్నం పెడుతున్న చేతిని ఆమె కాటువేయకూడదని గిరిరాజ్ అన్నారు.

పుల్వామా దాడిపై ఇటీవల స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు ఓ అవకాశం ఇవ్వాలంటూ మెహబూబా పేర్కొన్న నేపథ్యంలోనే గిరిరాజ్ ఈ మేరకు స్పందించారు. ‘‘పఠాన్‌కోట్ దాడి, ముంబై దాడుల విషయంలో పాకిస్థాన్‌కు ఆధారాలిచ్చినా పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజమే. అయితే, ఇమ్రాన్ కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టడం.. కొత్తగా చర్చలు ప్రారంభిస్తామంటూ చెబుతున్నందువల్ల ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చిచూడాలని మెహబూబా అంటున్నారు.