Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

నగరం నడిబొడ్డున దారుణం.. మైనర్‌ బాలికను..

Girl who went on to terrace to study found dead in Hyderabad, నగరం నడిబొడ్డున దారుణం.. మైనర్‌ బాలికను..

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. చిలికలగూడ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని వారాసిగూడలో ఓ మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తొలుత ప్రమాద వశాత్తు బిల్డింగ్ పై నుంచి పడిపోవడంతో చనిపోయిందనుకున్నారు. కానీ బిల్డింగ్‌పై వెళ్లి చూడగా.. అక్కడ రక్తపు మరకలు ఉండటంతో.. హత్యాగా భావించారు. అయితే రాత్రి చదువుకునేందుకని బిల్డింగ్‌పైకి వెళ్లిన బాలిక.. తెల్లవారుజామున ఇలా శవమై కనిపించడంతో.. తల్లిదండ్రులు బోరునవిలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారించగా.. షోయబ్ అనే యువకుడిపై అనుమానాల్ని వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యాలంటూ వేధించేవాడని.. అయితే తాము తిరస్కరించామన్నారు. ఈ నేపథ్యంలో తమ కూతురిపై కక్షపెంచుకుని.. ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నారు.

Related Tags